Krishna tirath joined in bjp

Krishna tirath, Krishna tirath joined bjp, Krishna tirath joins bjp, Krishna tirath resigns congress, Krishna tirath latest, Delhi Elections, Delhi Elections 2015, Delhi Elections updates, Delhi Elections party wise candidates, Bjp candidates in Delhi Elections, congress candidates in Delhi Elections, AAP campaign in Delhi Elections

Krishna Tirath joined in bjp : A major setback to congress party during Delhi Elections, party senior leader, former minister Krishna Tirath joined in bjp today. tirath met amit Shah and joined in party on monday.

కాంగ్రెస్ కు మైండ్ బ్లాంక్ అయ్యే షాక్

Posted: 01/19/2015 01:47 PM IST
Krishna tirath joined in bjp

సార్వత్రిక ఎన్నికల్లో డక్కాముక్కీలు తిన్న కాంగ్రెస్ పార్టీ.., మూలుగుతూ ఢిల్లీ ఎన్నికలకు సిధ్దమవుతుంది. ఈ లోగా మూలిగే నక్కపై తాటి పండు పడినట్లుగా.., కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, మాజి కేంద్రమంత్రి కృష్ణ తీరధ్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఈ ఉదయమే అమిత్ షాను కలిసిన మాజి మంత్రి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్టీ తరపున ఎన్నికల్లో పోటి చేయకపోయినా.., ప్రజల పక్షాన నిలబడి ఎన్నికల్లో పోరాడుతానని చెప్పారు. పార్టీలో తన స్థానం ఏమిటనేది అమిత్ షా నిర్వహిస్తారని, ప్రజలకు సేవ చేయటంపైనే తాను దృష్టి కేంద్రీకరిస్తానని ఆమె చెప్పారు.

కృష్ణ తీరధ్ ఇచ్చిన షాక్ తో కాంగ్రెస్ పార్టీ మైండ్ బ్లాంక్ అయింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఢిల్లీలో కీలక నేతగా ఉన్న తీరథ్ పార్టీకి దూరం కావటం ఫలితాలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఆప్ కు కళ్ళెం వేసేందుకు ఎత్తులు వేస్తున్న బీజేపీ.., ఆమ్ ఆద్మీ నేతలు కమలదళంలో చేరేందుకు ఆసక్తి చూపకపోవటంతో తమ శక్తి పెంచుకునేందుకు కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసి ఆకర్షిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు. యూపీఎ హయాంలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కృష్ణ తీరధ్ పని చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Krishna tirath  Delhi Elections  congress party  

Other Articles