Congress complaints against arvind kejriwal

Arvind Kejriwal, Arvind Kejriwal comments, Arvind Kejriwal bribe comments, Arvind Kejriwal latest comments, Arvind Kejriwal speech, Arvind Kejriwal controversy comments, Arvind Kejriwal on congress bjp, Cases on Arvind Kejriwal, Delhi elections, Delhi Elections campaign, congress candidates in Delhi elections, Delhi Elections Bjp Candidates

Congress complaints against Arvind Kejriwal : Congress Party complained election commission on Arvind Kejriwal for his comments on bribe. Aap leader to face a new problem from his self comments on bribe. Congress and BJP fires on Arvind Kejriwal comments and demands apology

మాజీ సీఎంకు ముదిరిన కష్టాలు

Posted: 01/19/2015 12:39 PM IST
Congress complaints against arvind kejriwal

ఎన్నికల వేళ ఆప్ నేత అరవింద్ కేజ్రివాల్ ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఒకప్పుడు చేజేతులా అధికారం పోగొట్టుకున్న అరవింద్, ఇప్పుడు ఎన్నికల కోసం చాలా కష్టపడుతున్నారు. ప్రజలను మెప్పించేందుకు తనదైన స్టైల్ లో ప్రసంగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేస్తున్న కొన్ని కామెంట్లు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ‘ ప్రజలుకాంగ్రెస్, బీజేపీ పార్టీల దగ్గర డబ్బు తీసుకుని.., ఆప్ అభ్యర్ధలకు ఓటేయాలి’ అన్న కామెంట్లపై దుమారం రేగుతోంది. రెండు పార్టీలు ఈ కామెంట్లపై మండిపడుతున్నాయి.

కాంగ్రెస్ ఒక అడుగు ముందుకేసి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో అవినీతిని ప్రోత్సహించేలా కేజ్రివాల్ ప్రసంగాలు చేస్తున్నారని కంప్లయింట్ లో తెలిపింది. కాంగ్రెస్ కంప్లయింట్ అందుకున్న ఈసీ వీడియో టేపులు పరిశీలించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చింది. కేజ్రివాల్ కామెంట్ పై కాంగ్రెస్ నేత, పార్టీ ఢిల్లీ ఎన్నికల కమిటీ సారధి అజయ్ మకెన్ మండిపడ్డారు. ప్రజలను పరోక్షంగా అవినీతికి ప్రోత్సహించేలా ఆప్ కన్వీనర్ మాట్లాడుతున్నారని ద్వజమెత్తారు.

అయితే అరవింద్ కేజ్రివాల్ కామెంట్లను ఆప్ నేతలు సమర్ధించుకుంటున్నారు. తమ అధినేత కామెంట్ ను సగం సగంగా అర్ధం చేసుకుని ఇలా గందరగోళానికి తెరతీస్తున్నారని విమర్శించారు. ‘దేశాన్ని దోచుకున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డబ్బుతో ఓట్లను కొనేందుకు మీ దగ్గరకు వస్తాయి. వారి నుంచి డబ్బులు వద్దు అనకుండా తీసుకొండి. కానీ ఓట్లు మాత్రం ఆప్ కు వేయండి. డబ్బులు ఇస్తే అధికారం వస్తుందన్న వారి ఊహ ఈ ఎన్నికలతో కనుమరుగైపోవాలి’ అని కేజ్రివాల్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arvind Kejriwal  Delhi Elections  Congress party  

Other Articles