Pradhan mantri adarsh yojana website scam

Pradhan Mantri Adarsh Yojana, Pradhan Mantri Adarsh Yojana scam, Pradhan Mantri Adarsh Yojana website scam, Pradhan Mantri Adarsh Yojana scam updates, PMAY scam updates, PMAY latest updates, PMAY funds scam, PMAY america updates, NDA Government programmes

Pradhan Mantri Adarsh Yojana scam : police find Pradhan Mantri Adarsh Yojana fake website scam and arrests some persons involved in scam. howrah based chatarjee starts a fake website with PMAY name and got crores of rupees donations

కోట్లు దోచుకున్న మోడి వెబ్ సైట్

Posted: 01/19/2015 10:56 AM IST
Pradhan mantri adarsh yojana website scam

దేశంలో మోడి మ్యానియా ఎంతగా ఉందో చెప్పలేము. ఆ మ్యానియాను ఓ ప్రభుద్ధుడు మనీగా మార్చుకున్నాడు. మోడీ పేరుతో వెబ్ సైట్ ప్రారంభించి కోట్ల రూపాయలు దండుకున్నాడు. ప్రభుత్వం ప్రారంభించే పధకాల పేరుతో వెబ్ సైట్ ప్రారంభించి, ప్రజలను నమ్మిచి కోట్లు దోచేశాడు. ఈ తతంగంపై నిఘా పెట్టిన పోలిసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ స్కాంకు సూత్రధారి హౌరాకు చెందిన ఛటర్జీ. సంచలనం రేపుతున్న ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వం ‘ప్రధానమంత్రి ఆదర్శ్ యోజన’ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఈ పథకం పేరిట చటర్జీ ఓ ఫేక్ వెబ్ సైట్ ప్రారంభించాడు. ఈ సైట్ సర్వర్ అమెరికాలో ఉంది. ఇదే ప్రభుత్వ వెబ్ సైట్ అని ప్రజలను నమ్మించేందుకు ఓ కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాడు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు, సందేహాలను ఈ కాల్ సెంటర్ ద్వారా పరిష్కరించేవారు. పథకం కింద పెద్ద పెద్ద ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇస్తుందని వెబ్ సైట్ లో ప్రచారం చేశాడు. ఈ పథకంకు ప్రాధమికంగా నిధులు అవసరమున్నాయి కాబట్టి సాయం చేయండి అని కోరాడు. ఈ విజ్ఞప్తికి స్పందించిన వారు లక్షల రూపాయల చొప్పున నిధులు పంపారు.

డబ్బులు ఇచ్చిన వారికి ప్రభుత్వ హామి రూపంలో స్టాంపులు, లెటర్ హెడ్ లను తయారు చేసి వారికి ఫేక్ అగ్రిమెంట్లు రాసిచ్చాడు. చివరకు ఇదంతా మోసం అని కొందరు గ్రహించారు. బాధితుల నుంచి విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ స్కాం లో ప్రమేయం ఉన్న మిగతావారి కోసం గాలిస్తున్నారు. ఏకంగా ప్రధాని పేరుతో వెబ్ సైట్ పెట్టి, ఎవరికి అనుమానం రాకుండా కాల్ సెంటర్ నిర్వహించి కోట్లు దండుకున్న చటర్జీ తెలివి చూసి పోలిసులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PMAY  Pradhan Mantri Adarsh Yojana  NDA government scams  

Other Articles