Jr ntr speech former minister sernior ntr 19 death anniversary

junior ntr latest news, jr ntr news, jr ntr ntr gardens, jr ntr speech, harikrishna news, balakrishna news, chandrababu naidu news, jr ntr speech senior ntr, junior ntr political entry, junior ntr latest

jr ntr speech former minister sernior ntr 19 death anniversary : junior ntr attends in his grandfather-former minister senior ntr 19 death anniversary.

తెలుగువారికి ‘రాజకీయ హామీ’ ఇచ్చిన జూ.ఎన్టీఆర్...

Posted: 01/18/2015 02:13 PM IST
Jr ntr speech former minister sernior ntr 19 death anniversary

గతకొన్నాళ్ల నుంచి రాజకీయాల నుంచి దూరంగా వుంటూ కేవలం సినిమాలకే పరిమితమైన జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు రాజకీయాలవైపు దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. నిన్నటివరకు తన కుటుంబసభ్యులు ముఖ్యంగా బాలయ్యతోబాటు టీడీపీ వర్గాల నుంచి దూరం పాటించిన జూనియర్.. నేడు అందరితోనూ మమేకమై అన్ని కార్యక్రమాల్లోనూ హాజరవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే రాజకీయవైపు అడుగులు వేస్తున్న ఈ నటుడు.. తాజాగా తెలుగువారికి ఓ హామీని ఇచ్చాడు.

ప్రముఖ నటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 19వ వర్థంతి సందర్భంగా ఆదివారం (18-01-2015) ఎన్టీఆర్ గార్డెన్స్’లోని ఆయన సమాధి వద్ద జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబసభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలోనే మాట్లాడిన ఆయన.. తెలుగు ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేవలం ఆయనకే దక్కుతుందని.. ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి అని పేర్కొన్నారు.

అలాగే మాట్లాడుతూ.. తెలుగువారంతా ఐక్యంగా వుండాలని పేర్కొన్న ఆయన ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం తాను కృషి చేస్తానని వెల్లడించారు. దీంతో ఎన్టీఆర్ మాట్లాడిన ఈ మాటలతో స్పష్టం అవుతుందేమిటంటే.. ఇకనుంచి ఆయన రాజకీయ కార్యకలాపాల్లో సైతం తనవంతు కృషి చేసే అవకాశాలు వున్నాయని అనుకుంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే.. ఎన్టీఆర్ అభిమానులకు పండగే పండగ!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles