Islamic state terrorists release 200 members embezzlement

islamic state terrorists, isis militants, isis terrorists, islamic state terrorists latest news, isis terrorists release 200 members

islamic state terrorists release 200 members Embezzlement

ఇస్లామిక్ ఉగ్రవాదుల మొట్టమొదటి ‘మంచి’ కార్యం..

Posted: 01/18/2015 04:00 PM IST
Islamic state terrorists release 200 members embezzlement

మునుపటికి భిన్నంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఓ మంచి కార్యం చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తేశారు. ఎప్పుడూ ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ నిత్యం దాడులకు ఎగబడే ఈ ఉగ్రవాదులు.. తమలోనూ మానవత్వ భావనలు వున్నాయని చాటిచూపించారు. అపహరించిన వ్యక్తులను ఒక్కొక్కరిగా చంపుకుంటూ వచ్చేవీరు.. ఈసారి అలాకాకుండా ఏకంగా 200 మందిని విడుదల చేసినట్లు సమాచారం.

గతంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇజ్ది తెగకు చెందిన చాలామందిని అపహరించారు. అందులో సుమారు 200 మందిని ఐఎస్ఐఎస్(ISIS) విడుదల చేసింది. బాగ్దాద్’కు 250 కిలోమీటర్ల దూరంలోని కిర్కిక్ పట్టణంలో వీరిని విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. విడుదలైన బందీలలో అత్యధికంగా వృద్ధులే వున్నారు. ఇలా విడుదలైన వారందరికీ వివిధ ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదిలావుండగా.. గత ఏడాది ఆగస్టులో ఉగ్రవాదులు ఇజ్ది తెగవారు అధికంగా వుండే ప్రాంతాల్లో దాడి చేసి.. కొన్ని వందలమందిని దారుణంగా చంపేశారు. ఆ దాడి నేపథ్యంలోనే మరింత మందిని అపహరించుకుని పోయారు. అందులో ఎంతమందిని వారు చంపేశారో తెలియదు కానీ.. 200 మందిని వదిలిపెట్టేశారు. విడుదలైనవారి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అయితే.. ఒక్కసారిగా ఉగ్రవాదులు ఇంతమందిని విడుదల చేయడం వెనుక ఏదైనా కుట్ర వుండవచ్చునన్న అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : islamic state terrorists  isis militants  

Other Articles