Isis suspect salman moinuddin arrest

Salman Moinuddin arrest, Salman Moinuddin ISIS, Salman Moinuddin terrorist, ISIS terrorism, ISIS abbrevation, ISIS updates, ISIS Hyderabad, Hyderabad terrorist attacks, ISIS in America, ISIS on America, US on ISIS, World Terrorist Attacks

ISIS suspect Salman Moinuddin arrest : hyderabadi Salman Moinuddin arrested by elangana police while he going to join in ISIS. Salman Moinuddin wanted to go from Dubai, Turkey to Syria to join in ISIS

ఆ పని ఎందుకు చేశాడంటావ్..?

Posted: 01/17/2015 07:41 AM IST
Isis suspect salman moinuddin arrest

ఉన్నత చదువులు చదివాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్ళి చేసుకుని భార్య, పిల్లలతో సంతోషంగా ఉంటున్నాడు. కాని సడన్ గా అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. లక్షల రూపాయల జీతం అందుకుంటున్న అతడకి మనసులో ఓ దురాలోచన పుట్టింది. ప్రపంచానికి ప్రస్తుతం పెను సవాల్ గా మారిన ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్)’ తీవ్రవాద సంస్థలో చేరాలనుకున్నాడు. ఇందుకోసం ఉద్యోగం వదిలేసి హైదరాబాద్ వచ్చి తీవ్రవాదంలో చేరేందుకు ప్లాన్ గీసుకున్నాడు. పక్కగా అమలు చేయటం మొదలు పెట్టి.., విదేశాలకు ఎగిరిపోదామని విమానాశ్రయంకు రాగానే అక్కడ సిద్ధంగా ఉన్న పోలిసులు పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు.

హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ ప్రాంతానికి చెందిన సల్మాన్ మొయినుద్దీన్ జేఎయన్టీయూ (హైదరాబాద్)లో బీటెక్ పూర్తి చేశాడు. అమెరికా వెళ్లి ఎం.ఎస్. చేసి అక్కడే ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. హైదరాబాద్ కు చెందిన ఓ అమ్మాయిని పెళ్ళి కూడా చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమెరికాలో ఉన్న సమయంలో ఐఎస్ఐఎస్ పై తీవ్రంగా ఆకర్షితుడు అయ్యాడు. ఇదే సమయంలో దుబాయ్ లో ఉండే అయేషా నికోలస్ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఉగ్రవాద శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం అక్టోబర్ లో దుబాయ్ వెళ్ళేందుకు సల్మాన్ వీసా ప్రయత్నించగా అక్కడి అధికారులు ఇవ్వలేదు.

హైదరాబాద్ వచ్చి ఎవరికి అనుమానం రాకుండా కొద్ది రోజులు ఉండి గురువారం రాత్రి హైదరాబాద్ వెళ్ళేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చాడు. అయితే మొయినుద్దీన్ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి పోలీసులు అతడిపై నిఘా పెట్టారు. ఎవరెవరితో మాట్లాడుతున్నాడు. ఆన్ లైన్ లో ఏం చేస్తున్నాడు... అనే విషయాలపై నిఘా పెట్టి, ఐఎస్ఐఎస్ కు వెళ్తున్నట్లు నిర్ధారించుకున్నారు. ఎయర్ పోర్టుకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు దుబాయ్ నుంచి టర్కీ వెళ్లి అక్కడి నుంచి సిరియాకు చేరుకోవాలని భావించినట్లు విచారణలో అంగీకరించాడు. ఇంతకీ ఎందుకు ఉగ్రవాదం పట్ల ఆకర్షితుడు అయ్యాడని విచారిస్తే.., మతం పట్ల మక్కువతో పాటు, హైదరాబాద్ కేంద్రంగా తాను ఉగ్రవాదంను నడపాలనుకున్నాడు. ఇందుకోసం హైదరాబాద్ లో ఉన్న సమయంలో పలువురు యువకులను కలిసి వారితో తీవ్రవాదంపై చర్చించినట్లు పోలిసులు సమాచారం సేకరించారు. నిందితుడిని రాజేంద్రనగర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించాడు.

పౌరులపై నిరంతర నిఘా పెట్టే అమెరికా పోలిసులు మొయినుద్దీన్ వ్యవహారంను గుర్తించలేకపోయారు. కాని హైదరాబాద్ కు రావటంతోనే తెలంగాణ పోలిసులు నిందితుడిపై అనుమానంతో నిఘా పెట్టారు. చివరికి వారు ఊహించిందే నిజం అయింది. ఈ విషయాన్ని అమెరికా పోలిసులకు కూడా వెల్లడించటంతో వారు కూడా హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. అటు మొయినుద్దీన్ కుటుంబంపై కూడా పోలిసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాను తిరిగివస్తాను అని ఖచ్చితంగా చెప్పలేనని కుటుంబ సభ్యులకు తెలిపినట్లు విచారణలో మొయినుద్దీన్ అంగీకరించాడు. దీంతో వారిని కూడా విచారించే అవకాశం ఉంది. అయితే నిందితుడి తండ్రి మాత్రం తన కొడుకు దుబాయ్ లో ఉద్యోగం వెతుక్కునేందుకు వెళ్తుండగా పోలిసులు అరెస్టు చేశారని చెప్తున్నాడు. దీనిపై వాస్తవాలు తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS  Salman Moinuddin  Hyderabad police  

Other Articles