Mahinda rajapaksa agrees to step down as party boss

Mahinda Rajapaksa, Maithripala Sirisena, SLFP, Sri Lanka Freedom Party, Sri Lanka politics, expelled general secretary, Rajapaksa to handover SLFP leadership, Basil Rajapaksa resign, Minister of Economic Development, omplaint on Rajapaksa graft cases, Marxist Janatha Vimukthi Peramuna (JVP),

Beleaguered former president Mahinda Rajapaksa has agreed to hand over Sri Lanka Freedom Party (SLFP)’s reins to the country’s new leader Maithripala Sirisena, bowing to the demand of party members after his shock election defeat.

పార్టీ పగ్గాలను సిరిసేనను అప్పగించనున్న రాజపక్షే

Posted: 01/16/2015 09:26 AM IST
Mahinda rajapaksa agrees to step down as party boss

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో దిగ్భ్రాంతికర పరాజయాన్ని మూటగట్టుకున్న ఆ దేశ మాజీ అధ్యక్షుడు రాజపక్సే ఎట్టకేలకు పార్టీ అద్యక్ష పదవి నుంచి కూడా తప్పుకోనున్నారు. శ్రీలంక ఫ్రీడం పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగి పార్టీ పగ్గాలను నూతన అధ్యక్షుడు సిరిసేనకు అప్పగించేందుకు అంగీకరించారు. పార్టీ ప్రదాన కార్యదర్శిగా గతంలో బాధ్యతలు నిర్వర్తించిన సిరిసేన.. ఆ తరువాత బహిష్కరణకు గురైయ్యారు. సుమారు దశాబ్ద కాలం తరువాత మళ్లీ సిరిసేనకు శ్రీలంక ఫ్రిడం పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలను చేపట్టనున్నారు,

ఇటీవల జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికలలో రాజపక్షే ఓటమిపాలవ్వడం, సిరిసేన గెలవడంతో, పార్టీ పగ్గాలను నూతన అధ్యక్షునికి అప్పగించాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. అయితే ఇందుకు రాజపక్షే మద్దతుదారులు కూడా కిమ్మనకుండా మిన్నకుండటంతో ఆయన పార్టీ అధ్యక్ష పదవిని అప్పగించేందుకు సిద్దపడ్డారు. అయితే అంతకుముందు పార్టీ పగ్గాలను అప్పగించేందకు కొంత సంశయించిన రాజపక్షేను పార్టీ చీలనునందన్న వార్తల నేపథ్యంలో పార్టీ ముఖ్యుల వారించడంతో దిగివచ్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు మహేంద్ర రాజపక్ష తన హాయంలో సాగించిన అవినీతి కార్యక్రమాలపై విచారణ జరపాలని నూతన ప్రభుత్వంలో భాగస్వామి అయిన మార్సిక్ట్ జనతా విముక్తి పెరమునా పార్టీ డిమాండ్ చేస్తూ పిర్యాదు చేసింది. రాజపక్షే సహా పార్టీ పదవులతో పాటు ప్రబుత్వంలో వున్న అయన కుటుంబ సభ్యులను విచారించాలని డిమాండ్ చేసింది. కాగా మహేంద్ర రాజపక్ష ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అయన సోదరుడు, బాసిల్ రాజపక్ష పార్టీ పదవికి రాజీనామా చేసి అమెరికాకు పయనమైనట్లు సమాచారం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahinda Rajapaksa  Maithripala Sirisena  SLFP  Sri Lanka Freedom Party  

Other Articles