Kcr asks metro rail to extend it

Kcr, kcr on metro rail, hyderabad metro rail, metro rail works, metro rail project, hyderbad metro rail project, hyderabad metro rail jobs, metro rail jobs, Hyderabad Metro Rail extension, telangana updates, telangana latest, Hyderabad security

kcr asks metro rail to extend it : Telangana cm asks Metro Rail to extend services to Ghatkesar, tirumalagiri, hayatnagar, patancheru areas. kcr orders to increase cc tv cameras in hyderabad for strengthen city security

కేసీఆర్ ప్రకటనతో ఆనందం, ఆందోళన

Posted: 01/13/2015 08:01 AM IST
Kcr asks metro rail to extend it

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరీ ఎక్కువైన ముందుచూపుతో వెళ్తున్నారు. హైదరాబాద్ లో ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియని మెట్రో సర్వీసు పనులు వేగవంతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. పనులపై ఎల్ అండ్ టీ అధికారులతో సమీక్ష జరిపిన సీఎం, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా మెట్రోను నగర శివార్లకు కూడా విస్తరించాలని సూచించారు. ఘట్ కేసర్, తిరుమలగిరి, హయత్ నగర్, పటాన్ చెరు ప్రాంతాలకు మెట్రోను విస్తరించాలన్నారు.

నగర శివార్లలో జనాభా పెరగటంతో పాటు, నగరం కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో మెట్రోను మరిన్ని ప్రాంతాలకు అవసరం అయ్యేలా నిర్మించాలని సూచించారు. ఈ ప్రకటనతో ఎల్ అండ్ టీ అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. శివార్ల పనుల కోసం ఎవర్నీ పిలవకుండా తమకే అప్పగించటం పట్ల సంతోషంగా ఉన్నారు. అయితే ప్రస్తుత పనులు ఎప్పటికి పూర్తవుతాయో అధికారుల్లోనే స్పష్టత లేదు. భూ లభ్యత, ప్రజల నుంచి వస్తున్న విమర్శలు ఇతర అంశాల నేపథ్యంలో పనులు ఆలస్యం అవుతున్నాయి. ఈ తరుణంలో కొత్తగా విస్తరణ మొదలు పెడితే గతంలో కోట్ చేసిన రేటే వస్తుందా లేక, ప్రస్తుత డిమాండ్ ప్రకారం మాట్లాడుకునే అవకాశం ఉందా తెలియక మధనపడుతున్నారు.

ఇక నగర భద్రతపై సమీక్షలో భాగంగా సీసీ కెమెరాల సంఖ్యను పెంచాలని పోలిస్ కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చారు. ఇందుకోసం ముంబైలో ఎల్ అండ్ టీ నిర్వహిస్తున్న సీసీ కెమెరాల పనితీరు పర్యవేక్షించాలని సూచించాడు. కమాండ్ కంట్రోల్ రూం నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ భవనాలన్నీ ఒకే చోట ఉండాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో 15 ఎకరాల స్థలాన్ని సేకరించాలన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  Metro Rail  Hyderabad latest  

Other Articles