Chandranna kanuka stops in chittoor district

Chandranna Kanuka, Chandranna Kanuka package, Chandranna Kanuka list, Chandranna Kanuka in Chittoor district, Chandranna Kanuka scam, Tirupati by elections, tirupati by election schedule, tirupati by election updates, tirupati latest, chittoor district updates, Andhra news updates

Chandranna kanuka stops in Chittoor district : Tirupati by election caused to stop Chandranna Kanuka in Chittoor district. Election Commission orders Andhra Pradesh government to stop distributing Chandranna Kanuka packages in Chittoor district

చిత్తూరులో చంద్రన్నకు బ్రేక్

Posted: 01/13/2015 07:31 AM IST
Chandranna kanuka stops in chittoor district

చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘చంద్రన్న కానుక’ కు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అసలే పధకం ఆలస్యంగా ప్రారంభం అయింది.. దీనికి తోడు అరకొర సరుకులు, నాణ్యతా లోప ఆరోపణలు వస్తుండగా పథకంకు ఇప్పుడు బ్రేకులు పడ్డాయి. ‘చంద్రన్న కానుక’ను నిలిపివేయాలని ఆదేశాలు వచ్చాయి. జిల్లాలో ఈ పథకం అమలు చేయవద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సహా దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. ఈ జాబితాలో చిత్తూరు జిల్లా తిరుపతి అసెంబ్లీ స్థానం కూడా ఉంది. టీడీపీ ఎమ్మెల్యే వెంకట రమణ మృతితో ఖాళీ ఏర్పడగా వచ్చే నెల 13న ఇక్కడ కూడా ఉప  ఎన్నిక నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల అయింది. ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి రావటంతో జిల్లాలో చంద్రన్న కానుక పంపిణీ నిలిపివేయాలని ఈసీ నుంచి ఆదేశాలు వచ్చాయి.

అంతేకాకుండా మిగతా జిల్లాల్లో ఎన్నికల హామీలు, ప్రకటనలు లేకుండా సంక్రాంతి సంబరాలు జరపాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అసలే పథకం ఆలస్యంగా ప్రారంభమైంది, అందులోను స్టాకు సరిగా లేక, సరుకులు మా వరకు వస్తాయా అని ప్రజల్లో ఆందోళనలు నెలకొనగా.., చిత్తూరు జిల్లాలో ఏకంగా పంపకాలు ఆపేయమనటంతో ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడినట్లుగా.., బాబుగారు కష్టపడి సరుకులు పంపినా ఎన్నికల కోడ్ అడ్డుకుంటోంది. దీంతో సొంత జిల్లాకు చంద్రన్న  ప్యాకేజి భాగ్యం లేనట్లే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Chandranna Kanuka  Tirupati by election  Election commission  

Other Articles