Peshawar army school resumes classes

Peshawar school resumes, Taliban-hit Peshawar school resumes, classes started in Taliban-hit school, peshawar military school, Tehreek-e-Taliban Pakistan, pakistan minister Mushtaq Ghani, Peshawar Army public school reopens, no permission to non security schools, police inspected schools, condolence to martyrs

The army-run Peshawar school which was ravaged by Tehreek-e-Taliban Pakistan a few weeks ago resumed its classes Monday

చేదు జ్ఞాపకం.. తొలిరోజంతా విషాద స్మృతిపథం..

Posted: 01/12/2015 05:50 PM IST
Peshawar army school resumes classes

పెషావర్ సైనిక పాఠశాల సోమవారం పున:ప్రారంభమైంది. సుమారు మూడున్నర వారాల తర్వాత విద్యార్థులు, టీచర్లు పాఠశాల ఆవరణలో అడుగుపెట్టారు. గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు వారు గుర్తు చేసుకున్నారు. తమ అప్తమిత్రులుగా వున్న వారు ఇక లేరని, వారు అనంత లోకాలకు తరలివెళ్లారని తలచుకుంటూనే విద్యార్థులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. పాఠశాల మూసివేసిన రోజున జరిగిన ఉగ్రకళిని వారు మర్చిపోలేకపోతున్నారు. ఒక వైపు పాఠశాల తెరిచారన్న ఆనందం వారిలో నెలకొన్నా.. మరోవైపు ఎప్పుడు ఏ ఘోరం జరుగుతుందోనన్న ఆందోళన మాత్రం ఆ పసిహృదయాలను వీడటం లేదు.

132 మంది అమాయక విద్యార్థులను అస్తిపంజరాలుగా మర్చిన ఘోరకళిని తలచుకుంటూ తొలి రోజు సాగిన పాఠశాలలో విషాధఛాయలకు సంబంధిచిన జ్ఞపకాలతో రోదనలు, సంతాపాలతోనే గడిచింది. ఎవరికి వారు తమ మిత్రుడు కానరాని లోకాలకు తరలివెళ్లారంటూ శోకసంధ్రంలో మునిగారు. విద్యార్థులతో పాటు పాఠశాల ఉపాద్యాయులు, బోధనేతర పిబ్బంది అంతా కలసి 148 మందిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. పాఠశాల ఇవాళ తిరిగి ప్రారంభమైనా..ఎటు వైపు నుంచి ముప్పు పోంచివుందన్న విషయం తెలియని విద్యార్థులు భయం గుప్పెట్లోనే తొలిరోజును గడిపారు.

ఉగ్రవాదులు పెషావర్ సైనిక పాఠశాల మీద విరుచుకుపడి 132 మంది బాలలు సహా మొత్తం 148 మందిని మట్టుబెట్టిన ఘటన వారు స్మృతిపథం నుంచి తొలగిపోవడం లేదు. ఆ రోజు జరిగిన ఘోరకళిని వీక్షించి అదృష్టవశాత్తు బతికివున్న విద్యార్థులు ఇంకా భయాందోళన మధ్యే వున్నారు. భయం భయంగానే వారు పాఠశాలలో అడుగుపెట్టారు. యావత్ ప్రపంచాన్ని కలచివేసిన ఉగ్రవాది దారుణమారణకాండలో తమ సహవిద్యార్థులు రక్తపుమడుగుల్లా మారిన ఘటనను వారు మర్చిపోలేకపోతున్నారు.

ఉగ్రవాదుల అరాచకానికి రక్తపు మడుగుల్లా మారిన పాఠశాలను, సిరా ఒలకాల్సిన చోట రక్తపుటేరులై పారిన తరగతి గదులను పూర్తిగా శుభ్రం చేసిన పాఠశాల యాజమాన్యం.. విద్యార్థులకు మారణకాండ తాలుకు జ్ఞపకాలు గుర్తుకు రాకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా అమయాక పసి హృదయాలకు తాకిన భయానక ఘటన ఎంత వద్దన్నా గుర్తుకు వచ్చింది. ఎట్టకేలకు తొలిరోజున భయం గుప్పెట్లోనే విద్యార్థులు పాఠశాలలో గడిపారు. ఈ దాడి అనంతరం పాకిస్థాన్లో భద్రత కారణాల రీత్యా విద్యాసంస్థలను మూసివేసి సెలవులు ప్రకటించారు. ఇప్పుడిప్పుడే మళ్లీ ప్రారంభమవుతున్నాయి. విద్యా సంస్థల వద్ద సాయుధులైన భద్రత సిబ్బందిని మోహరించారు.

పాకిస్థాన్ లో సరైన భద్రత కల్పించని పాఠశాలల్లో తరగతులను నిర్వహించేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. పాఠశాల చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడతో పాటు సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోకుంటే పాఠశాలల్లో తరగతులను నిర్వహించేందుకు అనుమతిని ఇవ్వబోమని పాకిస్థాన్ సమాచార శాఖా మంత్రి ముక్తాఖ్ గని చెప్పారు. ముఖ్యంగా పెషావర్ లోని పాఠశాలలన్నీ భద్రతా చర్యలను చేపట్టాలని ఆయన సూచించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు భద్రతా చర్యలు చేపట్టని పాఠశాలలకు అనుమతించబోమన్నారు. పాఠశాలల్లో భద్రతా చర్యలను అక్కడి పోలీసులు పరీక్షించి ఎన్ ఓ సీలు జారీ చే్స్తున్నారని, వాటిని పోందిన పాఠశాలలకే తరగతుల నిర్వహణకు అనుమతి ఇస్తున్నామని ముస్తాక్ గని చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  Peshawar Army School  Taliban attack  classes resume  condolence  

Other Articles