Cbi arrests income tax officials in bribery case

Income Tax officials scam, Income Tax officials bribery case, Income Tax officers bribe, CBI, IT officers arrest, IT officials bribe case, chennai I T department, Bangalore I T department, Chartered Accountants arrest, corruption in India

CBI Arrests Income Tax Officials in bribery case : CBI arrests I-T Officials and Chartered Accountants and also some of mediaters in bribery case. CBI raids in Chennai, Bangalore and Delhi for bribery officials arrests

కంచె చేను మేస్తే.., కటకటాలు తప్పలేదు

Posted: 01/12/2015 02:48 PM IST
Cbi arrests income tax officials in bribery case

దేశాన్ని కాపాడాల్సిన వారే దోచేస్తున్నారు. ఉన్నత పదవుల్లోని కొందరు ప్రభుద్ధులు అడ్డదారులు తొక్కుతున్నారు. అత్యాశకు పోయి అక్రమార్కులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. కంచే చేను మేసిన చందంగా.., దేశాన్ని కాపాడాల్సిన ఆదాయ పన్ను శాఖ అధికారులే అక్రమార్కులకు సహకరిస్తున్నారు. సీబీఐ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో అంతా అడ్డంగా బుక్కయ్యారు. అక్రమ ఆఫీసర్లంతా కటకటాల పాలయ్యారు. దేశంలో సంచలనం రేపిన ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కొందరు బడా వ్యక్తుల నుంచి పన్ను మినహాయింపు, ఎగవేత కేసుల ఎత్తివేత కోసం లంచాలు తీసుకుంటున్నట్లు సమాచారం అందింది.

వెంటనే రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ఐటీ ఉన్నతాధికారులపై రహస్యంగా ఆపరేషన్ నిర్వహించారు. తమకు వచ్చిన సమాచారం నిజమే అని రుజువు చేసుకున్నాక, అసలు పని మొదలు పెట్టారు. చెన్నై, ముంబై నగరాల్లో దాడులు జరిపారు. ఈ దాడుల్లో కీలక పదవుల్లో ఉన్న అధికారులను చూసిన సీబీఐ విస్తుపోయింది. జాయింట్ డైరెక్టర్లు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్లు అంతా ఒక యూనిట్ గా ఏర్పడి ప్రముఖుల లావాదేవీలు చక్కదిద్దుతున్నట్లు గుర్తించింది. ఏకంగా చెన్నై ఐటీ శాఖ జాయింట్ డైరెక్టర్ సలోంగ్ యాడెన్ అరెస్టయ్యారు.., అంటే ఐటీ శాఖలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

సీబీఐ అరెస్టు చేసిన మిగతావారిని చూస్తే.., చార్టెడ్ అకౌంటెంట్లు సంజయ్ బండారి, శ్రేయ బండారా, చెన్నై ఐటీ జాయింట్ డైరెక్టర్, సీనియర్ అధికారులు ఉన్నారు. వీరితో పాటు ఐటీ ఇన్వెస్టిగేషన్ టీం చీఫ్ కూడా దొరికిపోయారు. వీరందర్నీ అరెస్టు చేసి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఈ ప్రబుద్ధులు నోరు విప్పితే ఎందరు ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయో చూడాలి. డబ్బంతా ఇలా అక్రమార్కుల చేతిలో ఉంటే ఖజానాకు డబ్బులెక్కడినుంచి వస్తాయి.. దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Income Tax bribe case  CBI  corruption in India  

Other Articles