Delhi police registers murder case in sunanda pushkar death

former union minister shashi tharoor, shashi tharoor wife sunanda pushkar, sunanda pushkar murder, sunanda death unnatural, sunanda death due to poisoning, sunanda suspectable case turned murdered, sunanda poisoned orally, or injected, sunanda pushkar, shashi tharoor to be enquired

Delhi Police on Tuesday registered a murder case in the mysterious death of former union minister Shashi Tharoor's wife Sunanda Pushkar.

విష ప్రయోగం వల్లే సునందా పుష్కర్ మరణించారు...

Posted: 01/06/2015 01:40 PM IST
Delhi police registers murder case in sunanda pushkar death

కేంద్ర మాజీమంత్రి శశి థరూర్ మూడవ భార్య సునందా పుష్కర్ది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. గత ఏడాది జనవరిలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం కోలువుదీరిన సమయంలో.. కేంద్ర మంత్రిగా థరూర్ న్యూఢిల్లీలో కేబినెట్ సమావేశంలో పాల్గొన్నప్పుడు.. ఢిల్లీలోని ఓ హోటల్లో ఆయన భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆమె మరణానికి కారణం ఏంటన్నది అప్పట్లో పూర్తిగా నిర్ధారణ కాలేదు. దీనిపై అన్ని వర్గాల ప్రజల నుంచి అనుమానాలు రేకెత్తాయి. దీంతో కేసును మరోమారు దర్యాప్తు చేయాలని బీజేపి నేత సుబ్రహ్మణ్య స్వామి బహిరంగంగానే డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సునందా పుష్కర్ పై విష ప్రయోగం జరిగిందని ఇప్పుడు ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. అజ్ఞాత వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

అతిగా నిద్రమాత్రలు మింగడం వల్లే మరణించారని అప్పట్లో అన్నారు గానీ.. ఆమెకు ఎవరైనా బలవంతంగా ఆ మాత్రలు ఇచ్చారా, లేక ఆమే తీసుకున్నారా అనే విషయం తెలియలేదు. తాజాగా ఇప్పుడు ఢిల్లీ పోలీసులు మాత్రం సునందది హత్యేనని నిర్ధారించారు. దాంతో ఈ కేసులో శశి థరూర్ సహా పలువురిని ఢిల్లీ పోలీసులు విచారించనున్నారు. సునందా పుష్కర్‌ది హత్యేనని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి ఎస్ బస్సీ ధ్రువీకరించారు. విషప్రయోగం వల్లనే సునందా పుష్కర్ మరణించారని ఢిల్లీ తెలిపారు. సునంద మృతిపై ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ నుంచి పోస్టుమార్టం నివేదిక డిసెంబర్ 29వ తేదీన తమకు అందినట్లు ఆయన చెప్పారు. మరణం 'అసహజం' అని, 'విషప్రయోగం' వల్లే సంభవించిందని అందులో వైద్యులు నిర్ధారించినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు ఆమె మృతి కేసును హత్య కేసుగా పోలీసులు మార్చారు.

కాగా, సునంద పుష్కర్ మృతిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం జరిగిందన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా పోస్టుమార్టం నివేదిక మార్చాలని ఎయిమ్స్ లోని ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తాపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. సునంద మృతిని సహజ మరణంగా పేర్కొనాలని ఉన్నతస్థాయిలో తనపై ఒత్తడి తెచ్చారని విజిలెన్స్ కమిషన్ అధిపతికి గుప్తా లేఖ రాసినట్టు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. తాను లొంగకపోవడంతో తనను లక్ష్యంగా చేసుకున్నారని వాపోయారు. తన స్థానంలో వేరొకరిని ఫోరెన్సిక్ విభాగం అధిపతిగా నియమించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు 'క్యాట్' కూడా లేఖ రాశారు. విషం కారణంగానే సునంద మరణించినట్టు గుప్తా తన నివేదికలో పేర్కొన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : sunanda pushkar  shashi tharoor  murder  poisoning  

Other Articles