Ganesh patro passes away

Ganesh Patro death, Ganesh Patro died, Ganesh Patro passes away, tollywood deaths, Ganesh Patro movies, tollywood on Ganesh patro, Ahuti Prasad Death, Ahuti Prasad funeral, Ahuti Prasad cancer, Ahuti Prasad death updates, Ahuti Prasad last rites, tollywood updates, latest news updates

Ganesh Patro passed away : movie dialogue writer Ganesh patro died on monday. patro suffers from cancer due to desease he left the world. tollywood and kollywood pays condolance on Ganesh Patro death

సినీ రచయిత గణేష్ పాత్రో కన్నుమూత

Posted: 01/05/2015 11:03 AM IST
Ganesh patro passes away

మాటల రచయిత గణేష పాత్రో సోమవారం కన్నుమూశారు. కొద్ది కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న గణేష్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విజయనగరం జిల్లా పార్వతీపురంకు చెందిన ఈయన, పలు తెలుగు, తమిళ సినిమాలకు మాటలను రాయటంతో పాటు సాహితీవేత్తగా కూడా పనిచేశారు. 1970 నుంచి 1990 వరకు చాలా సినిమాలకు కథలను కూడా అందించారు. ఆయన కథ, మాటలు, పాటలు అందించిన సినిమాలు చూస్తే, ‘రుద్రవీణ’, ‘ప్రేమించు పెళ్ళాడు’, ‘ఇది కథ కాదు’, ‘మయూరి’, ‘సీతారామయ్య గారి మనవరాలు’ తదితర సినిమాలకు పనిచేశాడు.

నాటక రచయితగా కూడా మంచి పేరు సంపాదించారు. త్రివేణి, ఆగండి! కొంచెం ఆలోచించండి, కొడుకు పుట్టాలా వంటి నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాకు శ్రీకాంత్ అడ్డాలతో కలిసి మాటలు రాశారు. గణేష్ మృతి పట్ల టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ganesh Patro death  tollywood latest  kollywood updates  

Other Articles