Youth killed by train in hitech city railway station

youth killed by train, techie hit by train, youth killed hitech city railway station, techie killed hitech city railway station, youth crossing the tracks, techie crossing the tracks, hitech railway station, software engineer, mobile,

techie hit by train while crossing tracks, who was talking cell phone and did not notice the trains, says witness

ప్రమాదాన్ని పసిగట్టలేక.. బలైపోయిన యువకుడు..

Posted: 01/03/2015 04:57 PM IST
Youth killed by train in hitech city railway station

శాస్త్రా సాంకేతిక రంగాల్లో నానాటికీ వస్తున్న విప్లవం.. మనిషి జీవితాన్ని అవసరముండే విదంగా అన్వయించుకుని వినియోగించుకోవాలని. లేని పక్షంలో ప్రమాదం బారిన పడటం ఖాయం. టెలికమ్యూనికేషన్స్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా దేశంలో రమారమి ప్రతీ వ్యక్తి చేతిలోనూ సెల్ పోన్ వుంది. అయితే సెల్ పోన్ మాట్లాడే ప్రతీవారు తగిన జాగ్రత్తలు తీసుకోవలని మన ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే వున్నాయి. పెట్రోల్ బంకుల వద్ద, రైల్వే క్రాసింగ్ ల వద్ద గ్యాస్ లీకవుతున్న చోట, వాహనాలను నడుపుతూ సెల్ లో మాట్లాడకూడదని ప్రభుత్వాలు, పోలీసులు హెచ్చరిస్తూనే వున్నారు. అయినా వారి మాటలను పెడచెవిన పెట్టిన ఓ సాప్టవేర్ ఇంజనీర్ ప్రమాదాన్ని పసిగట్టలేక మాటల్లో పడి తన ప్రాణాలను అనంతవాయువుల్లో కలుపుకున్నాడు.

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో జరిగిన ఈ ఘటనతో స్తానికంగా విషాదం చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్లో ట్రాక్ దాటుతున్న యువకుడిని రైలు ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో సదరు యువకుడు అక్కడికక్కడే మరణించాడు. రైల్వేస్టేషన్లోని ప్రయాణికులు, సిబ్బంది వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. లీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకుని ... పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు సెల్ ఫోన్ మాట్లాడుతు రైల్వే ట్రాక్ దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hitech railway station  software engineer  mobile  

Other Articles