Woman attempts suicide at ccs office

woman attempt sucide, accused woman attempts suicide, woman attempts suicide at ccs office, woman sucide attempt, woman sucide attempt at ccs office, woman cheated NRI, ccs, malavika, dcp palaraju, nri, cheating, bridegroom, suicide attempt, poison, crime against woman, violence against woman

woman accused in NRI cheating case had attempted sucide at ccs office in police enquiry

మాలవిక ఎందుకిలా చేసింది..?

Posted: 01/03/2015 11:09 AM IST
Woman attempts suicide at ccs office

మాళవిక. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా..? ఎక్కడో విన్నటుంది కదూ. ఎన్.ఆర్.ఐ లను టార్గెట్ చేసి మోసం చేసిన మహిళ. అయితే ఈ కేసుకు సంబందించి అమెను సీసీఎస్ కార్యాలయంలో పోలీసులు నిన్న విచారించారు. కాగా అమె పోలీసుల ప్రశ్నలకు బదులివ్వలేక ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాంతో ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇంతకీ మాళవిక ఎందుకు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అమెను పోలీసులు అంత కఠినంగా విచారించారా..? లేక నిజాలు బయట పడటం ఇష్టంలేక అమె అలా చేసిందా..? లేక పోలీసులు విచారణను తప్పించుకునేందుకు ముందుగానే ఇలా ప్లాన్ చేఃసుకుని మాళవిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందా..?

వివరాల్లోకి వెళితే ఎన్ఆర్ఐని మోసం చేసిన కేసులో మాళవిక అనే మహిళను నిన్న పోలీసులు విచారిస్తున్నారు. అయితే పోలీసులు విచారిస్తుండగానే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు మాళవికను హుటాహుటీన చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. ఆమె విషం తాగినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా వెబ్సైట్లో వరుడు కావాలని ప్రకటనలు ఇస్తూ మాళవిక మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఓ ఎన్ఆర్ఐని ఆమె మోసం చేయటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈ వ్యవహారంపై సీసీఎస్ డీసీపీ పాలరాజు మాట్లాడుతూ విచారణకు ముందే మాళవిక విషం తాగి సీసీఎస్కు వచ్చినట్లు తెలిపారు. ఆమో వద్ద సూసైడ్ నోట్ లభించినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా ఓ ఎన్ఆర్ఐని మోసం చేసినట్లు ఫిర్యాదు అందిన నేపథ్యంలో మాళవికను విచారణకు పిలిచినట్లు డీసీపీ చెప్పారు. మొత్తానికి ఈ ఘటన వెలుగుచూడటంతో మాళవిక ఆత్మహత్యాయత్నం కేసులో సీసీఎస్ పోలీసుల విచారణపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి.

జి.మనోహర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ccs  malavika  dcp palaraju  nri  cheating  bridegroom  suicide attempt  poison  

Other Articles