Vaishnava alayas take mukkoti charm

Vaishnava temples take 'mukkoti' Charm, mukkoti ekadasi charm, mukkoti ekadasi charm in Vaishnava temples take 'mukkoti' Charm. tirumala devasthanam on mukkoti ekadasi, badrachalam on mukkoti ekadasi, yadagirigutta on mukkoti ekadasi, temples in andhrapradesh, temples in telangana

arrangements made by temple authorities in lieu of mukkoti ekadasi

వైష్ణవాలయాలకు ‘ముక్కోటి’ శోభ..

Posted: 12/31/2014 04:13 PM IST
Vaishnava alayas take mukkoti charm

తెలుగురాష్ట్రాల్లోని వైష్ణవాలయాలు ముక్కోటి ఏకాదశి శోభను సంతరించుకుంటున్నాయి. ఏడాదికి ఒక్కసారి వచ్చే ముక్కోటి ఏకాదశి పర్వదినాన.. వేకువ జామున తొలి ఘడియల్లో స్వామి వారిని ఉత్తర ద్వారా దర్శనం ద్వారా దర్శించుకున్న భక్తులకు సకల పాపాలు తొలగుతాయన్న విశ్వాసం. దీంతో పాటు నూతన సంవత్సర కూడా ఇదే రోజున కలసిరావడం కాకతాళీయమే. ఈ నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయాల దర్శనానికి రానున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో, తెలంగాణలోని భద్రాచలంలో పర్వదిన సందడి నెలకొది. తిరుమలేశుడి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి దాటాక భక్తుల కోసం ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం కానుంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని బుధవారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం అర్ధరాత్రి దాకా వైకుంఠ వాకిలిని తెరిచి ఉంచనున్నారు. కాగా.. గురువారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం (ఆలయశుద్ధి) కార్యక్రమం నిర్వహించారు.

మరోవైపు.. భద్రాచలంలో ఇవాళపవిత్ర గోదావరి నదిలో శ్రీసీతారామచంద్రస్వామికి హంసాలంకృత లాంచీపై తెప్పోత్సవం నిర్వహించనున్నారు. గురువారం స్వామివారు మహావిష్ణువు అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. గరుడ వాహనరూఢుడు కానున్నారు. ఉత్తర ద్వార దర్శనానికి, ఈ వేడుకలను తిలకించేందుకు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న రానున్నారు.

అటు ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహ స్వామి భక్తజనులకు వైకుంఠ ద్వార దర్శనం ఇవ్వనున్నారు. మహిమాన్విత లక్ష్మీనరసింహుల తూర్పు ద్వార దర్శనం గురువారం వేకువజామున 6.49 నిమిషాలకు జరుగుతుంది. అదే విధంగా ఆలయ ప్రాశస్త్యం కోసం పాంచరాత్రగమ శాస్త్రరీతిలో నిర్వహించే అధ్యయనోత్సవాలకు శ్రీకారం జరుగుతుంది. ఈ ఉత్సవాలు 6 రోజులపాటు విశేష అలంకర పొరప్పాటు సేవలతో సంప్రదాయరీతిలో నిర్వహిస్తారు. జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు, పవిత్ర వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం.అధ్యయనోత్సవాల ప్రారంభం సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలుకగుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mukkoti ekadasi  vaishnava temples  devotees  

Other Articles