Nalgona zp chairman balu nayak will join in trs telangan toatal zp trs

nalgonda zp chairman, nalgonda zp chairman balu naik, trs leader balu nayak, nalgonda zp chairman balu nayak, balu nayak joined in trs

nalgona zp chairman balu nayak will join in trs

ఆ పార్టీ కి ఉన్న ఒక్క జడ్పి పోయినట్లేనా!!

Posted: 12/30/2014 11:33 AM IST
Nalgona zp chairman balu nayak will join in trs telangan toatal zp trs

సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క జడ్పి పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు ఆ జడ్పీ పీఠం కూడా దక్కేట్లు కనిపించటం లేదు. నల్లగొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ బాలూ నాయక్ కూడా టిఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోబోతున్నారని కొన్ని వర్గాలు చెప్తున్నాయి. ఈ మేరకు ఆయన అతనితో పాటు పలువురు నేతలను కూడా పెద్ద ఎత్తున తీసుకొని వస్తున్నట్లు తెలుస్తుంది.  గతంలో దేవరకొండకు ప్రాతినిధ్యం వహించిన బాలూ నాయక్, ఈసారి కాంగ్రెస్ టిక్కెట్ రాకపోవడంతో జడ్పికి పోటీచేశారు.

కాంగ్రెస్ కు తెలంగాణలో ఉన్న ఏకైక చైర్మన్ ఈయన ఒక్కరే. ఇప్పుడు ఈయన కూడా టిఆర్ఎస్ లో చేరితో అన్ని జడ్పిలు టిఆర్ఎస్ వశం అయినట్లే అవుతుంది. కొద్ది కాలం క్రితం ఖమ్మం జడ్పి చైర్ పర్సన్ కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి టిఆర్ఎస్ లో చేరిపోయారు. దాంతో ఖమ్మం జిల్లా జడ్పి కూడా తెరాస పార్టీ పరమైనట్లు అయ్యింది. బాలు నాయక చేరికతో అన్ని జడ్పిలు తెరాస పరమవుతున్నాయని కొందరు నేతలు భావిస్తున్నారు. నల్లగొండ మంత్రి జగదీష్ రెడ్డి రాయబారం చేసి బాలూ నాయక్ ను టిఆర్ఎస్ లోకి తీసుకువస్తున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈయన చేరికతో నల్గొండ జిల్లాలో తెరాస కొంత బలపడే ఆస్కారం ఉందని ఆ నేతలు భావిస్తున్నారు.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nalgonda district  zp chairman  trs party  

Other Articles