Telangana cm kcr behaviour changed

telangana mla, kcr, telangana cm kcr, telangana cm kcr appointment, cm kcr behaviour, cm kcr attitude, kcr behaviour

telangana cm kcr behaviour changed he doesnt meet anyone without apppointment include mlas

కెసిఆర్ అలా చేయటంలో ఆంతర్యం ఏమిటో మరి!!

Posted: 12/30/2014 11:08 AM IST
Telangana cm kcr behaviour changed

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవహార శైలి కొందరికి మింగుడు పడటం లేదని భోగట్టా!! ఉద్యమ నేతగా ఉన్నప్పుడు కెసిఆర్ ఇంటికి వచ్చిన నేతల్ని ఎవర్నైనా కాస్త ఆలస్యమైనా కలిసే పంపించేవాడు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. ఉద్యమ నేత ముఖ్యమంత్రి అయ్యాడు. పదవితో పాటు ప్రవర్తన కూడా మారినట్లు బయట కొన్ని వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఎవరైనా వ్యక్తులను కలుసుకోవటం లో కాని ఇంటికి వస్తే మాట్లాడి పంపించటంలో కానీ కెసిఆర్ మునుపటి పద్ద్దతులను అనుసరించటం లేదని ఆ వర్గాలు వాపోతున్నాయట!

కానీ ఇది నిజమైతే మాత్రం భవిష్యత్ కెసిఆర్ కు చాల ఇబ్బందులు వస్తాయని అనుకుంటున్నారు. ఆయ వ్యక్తులను కలుసుకోవటం లో కాని, చివరికి ఎం.ఎల్.ఏ లకు అపాయింట్మెంట్ లేనిదే కలుసుకోవటం కాని చేయటం లేదంట!! ఇది ఒక వేల నిజమే అయితే కెసిఆర్ కు అంత గౌరవం ఉండబోదని బయట వర్గాలు బహిరంగంగానే చర్చించుకుంటున్నాయి. పైకి ఎం.ఎల్.ఏ లు ఈ విషయం మాట్లాడకపోయినా, భవిష్యత్త్ లో విమర్శించే అవకాశం ఉండకపోదనీ పలువురు నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

సాధారణ ప్రజలను ఎవరినైనా కలుసుకోవటానికి సిద్దంగా ఉండవలసిన ముఖ్యమంత్రులు ఆంక్షలు గిరి గీసుకుని ఉండటం పద్ధతి అనిపించుకోదని కొన్ని వర్గాలు బాహాటంగానే అనుకుంటున్నయంట. చివరికి ముఖ్యమంత్రి పేషి లో ఉండే అధికారులకు కూడా కలుకోనీకుండా వాలకి కూడా అపాయింట్ మెంట్ తీసుకోనిదే కెసిఆర్ దగ్గరకి పంపించటం లేదని కొన్ని వర్గాలు గొణుక్కుంటున్నాయి. ఇలా అన్ని సార్లు అపాయింట్ మెంట్ తీసుకుంటేనే కలుస్తామని అనటం ముఖ్యమంత్రి కి మంచిడి కాదని బయట వర్గాలు అనుకుంటున్నాయి. ఈ విధంగా వ్యవహరించటం ఉద్యమ నేతలుగా ఉండి కీలక పదవి వరకు ఎదిగిన నాయకుడు ఇలా వ్యవహరించటం సమంజసమా కాదా అన్నది భవిష్యతే చెప్తుందని కొన్ని వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇటీవల వరంగల్ జిల్లా పర్యటనకు, పలు జిల్లాల పర్యటనలకు కూడా వెళ్ళినప్పుడు కూడా మీడియా పై చాలా ఆంక్షలు పెట్టటం కూడా కొన్ని వర్గాలకు ఆశ్చర్యంగానే ఉందట!!

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana cm kcr  behaviour  telangana mlas  

Other Articles