Cabinet approves ordinance making major changes in land acquisition act

Union Government of india, cabinet approves Land Acquisition Act ordinance. central cabinet approves Land Acquisition Act, central cabinet approves changes in Land Acquisition Act, Ordinance for land acquisition, Narendra Modi, Arun Jaitley, PPP projects, Union Cabinet, rural infrastructure,

Government recommended promulgation of an ordinance making significant changes in the Land Acquisition Act including removal of consent clause for acquiring land for five areas of industrial corridors, PPP projects, rural infrastructure, affordable housing and defence.

భూసేకరణ చట్టంలో సవరణలకు కేంద్రక్యాబినెట్ అమోదం

Posted: 12/29/2014 10:26 PM IST
Cabinet approves ordinance making major changes in land acquisition act

భూసేకరణ చట్టంలో కీలక సవరణలకు కేంద్రమంత్రివర్గం సోమవారం ఆమోద ముద్రవేసింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర క్యాబినెట్.. భూసేకరణ చట్టంలో మార్పులతో పాటు పలు మురికివాడలలోని నివాసాలను గుర్తింస్తూ అమోదముద్ర వేసింది. రైతుల నుంచి భూములు సేకరించే క్రమంలో వారికి ఇచ్చే పరిహారాంతో పాటు ప్రత్యామ్నాయ భూములను కూడా చూపాలన్న సవరణ సహా పలు సవరణలకు కేంద్ర మంత్రిమండలి అమోదం తెలిపిందని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.

సోమవారం దిల్లీలో సమావేశమైన కేంద్రమంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో భూసేకరణ చట్ట నిబంధనలు సరళతరమవుతాయన్నారు. ఫలితంగా పరిశ్రమలకు భూసేకరణ సులువు కానుందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రణాళికేతర వ్యయంపై కూడా చర్చించినట్లు చెప్పారు. బొగ్గు గనుల అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు వెల్లడించారు. అలాగే ఇనుపఖనిజంతో సహా ఇతర ఖనిజాల గనుల వేలానికి సంబందించిన ఆర్డినెన్స్ లను కూడా ఆమోదించిందని తెలిపారు.

ఈ ఖనిజాల వేలంలో జాప్యం వల్ల వందలాది కోట్ల డాలర్ల పెట్టుబడులు, ప్రాజెక్టులు నిలిచి పోతున్నాయన్నారు. భూ సేకరణ చట్టంలో ఆంక్షల కారణంగా రైళు, ఉక్కు, మైనింగ్ , రోడ్ల విస్తరణ వంచి రంగాల్లో రూ. 20 లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టులు నిలిచిపోయాయని కేంద్ర కేబినెట్ అభిప్రాయపడిందన్నారు. ఈ బిల్లు పారిశ్రామిక విస్తరణకు, భూ ఒప్పందాలకు అవరోధంగా మారిందని పలు కంపెనీలు తెలిపాయని... 2013 భూ సేకరణ చట్టం ఈ ఏడాది జనవరి నుంచి అమలులోకి వచ్చింది. ఇక ముందు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ప్రాజెక్టులకు భూమి యజమానుల ఆమోదం తప్పని సరి అన్న నిబంధనను తొలగిస్తూ చట్టంలో మార్పులు చేశామన్నారు. 50 శాతం భూ యజమానుల ఆమోదం లభిస్తే ప్రాజెక్టు ఆమోదం పొందే వీలు కలుగుతుందన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Land Acquisition Act  Narendra Modi  Arun Jaitley  Union Cabinet  

Other Articles