Kissing baba arrested in kadapa

Kissing Baba' arrest, Kissing Baba' arrested in Kadapa, baba kissing women, baba gives lemons to male devotees, AP Police arrested Kissing baba, AP Police arrest fake baba, kadapa fake baba, kadapa kissing baba, Proddatur fake baba, Proddatur kissing baba

AP Police on arrested a fake godman from Proddatur town of Kadapa district, also known as the ‘kissing baba’.

ITEMVIDEOS: మరో ‘కిస్సింగ్ బాబా’ బాగోతం భట్టబయలు

Posted: 12/27/2014 03:05 PM IST
Kissing baba arrested in kadapa

కడప జిల్లాలో మరో రోమాంటిక్ బాబా బాగోతాన్ని పోలీసులు భట్టబయలు చేశారు. అమాయక జనాన్ని తన మాటలతో నమ్మించిన ఈ బాబా.. లింగవివక్షతో వైద్యం చేస్తున్నాడు. ఆడవారికి ఒకలా, మగవారికి మరోలా కనుకరిస్తున్నాడు. ఈ బాబా కేవలం మాయల మారాఠి కాదు.. రోగాలను కూడా నయం చేస్తాడు. దీంతోనే బాబా గుర్తింపు పొందారు. బాబాను అశ్రయించే మహిళా భక్తులకు రోగాలను నయం చేసే విధానం కాస్త వివాదాస్పందగా మారింది. అంతే రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇంతకీ బాబా మహిళా భక్తుల రోగాలను ఎలా నయం  చేసేవారు..?

కడప జిల్లాలోని ప్రోద్దుటూర్ పట్టణంలో వున్న ముద్దుల బాబా.. తనను ఆశ్రయించిన పురష భక్తులకు నిమ్మకాయలు ఇచ్చి వ్యాధి నయం అవుతుందంటూనే.. మహిళా భక్తుల రోగాలను నయం చేసేందుకు నయా మార్గాన్ని అన్వేషించాడు. మహిళా భక్తులకు మెడపైన, బుగ్గపైన, వారి రోగాలను బట్టి శరీరంలోని పలు బాగాల్లో ముద్దులు పెట్టేవాడట. లింగ వివక్షతో వైద్యం చేసి.. ఆడవారికి మాత్రమే ముద్దులు కురిపించి, మగవారికి మాత్రం నిమ్మకాయలు ఇచ్చేవాడు. విషయం కాస్తా వివాదాస్పదం కావడంతో పోలీసులు రంగం ప్రవేశం చేయడం..అతన్ని జ్యూడీషియల్ రిమాండ్ కు తరలించడం కూడా చకచకా జరిగిపోయాయి.

కాగా బాబాను కొర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు అతడి మానసిక స్థితిపై సందేహం కలుగుతుందని వ్యాఖ్యానించింది. అతడిని పిచ్చాసుపత్రిలో చూపించాలని అదేశించింది. బాబా మహిమళను నలుదిశలా చాటే బాబు అనుంగు శిష్యుడు సుబ్బారెడ్డిని కూడా అదుపు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రోద్దుట్టూరు పట్టణంలోని స్థానిక అయప్పస్వామి ఆలయం వద్ద గదిని అద్దెకు తీసుకున్న బాబా.. రెండు నెలలుగా వైద్యం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kissing Baba  arrest  Kadapa  fake baba  

Other Articles