Telangana nijamabad mp kavitha fires ashoka gajapati raju

nijamabad mp kavita recent statements, nijamabad mp kavitha history, nijamabad mp kavita profile, mp kavita fires on ashoka gajapati raju, mp kavita questions in parliament

telangana nijamabad mp kalvakuntla kavita fires on central minister ashok gajapathi raju abour ordinance

అశోక గజపతి రాజువి అబద్దాలంట...!!

Posted: 12/27/2014 03:18 PM IST
Telangana nijamabad mp kavitha fires ashoka gajapati raju

కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు అసత్య ప్రచారం చేస్తున్నారని నిజామాబాద్ ఎమ్.పి కవిత అంటున్నారు. విభజన బిల్లుకు సంబంధించి అప్పాయింట్ డే ని పది రోజులు వాయిదా వేద్దామని, చట్టంలోని లోపాలను సవరించుదామని కేంద్రం, హోం మంత్ర రాజ్ నాద్ సింగ్ భావించి, కెసిఆర్ ను సంప్రదించగా, ఆయన ఒప్పుకోలేదని అశోక్ గజపతి రాజు చెప్పినదానిపై ఆమె ఖండించారు. ఎలాంటి ప్రతిపాదనలు కేంద్రంకాని,రాజ్ నాద్ సింగ్ కాని కెసిఆర్ కు చేయలేదని ఆమె స్పష్టం చేశారు.

కెసిఆర్ పై నిరాధార ఆరోపణలు చేస్తే ఒప్పుకోబోమని ఆమె అన్నారు.ఇదివరకు ఇలానే కెసిఆర్ పై అసత్య ఆరోపణలు చేశారని అవేమో ఆయనను ఎం చేయలేకపోయానని, అసలు వాళ్ళు ఎలా చేస్తున్నరో ఎం చేస్తున్నారో ప్రజలకు తెలుసునని, వాళ్ళే అంత గమనిస్తున్నారని అన్నారు. ముంపు మండలాల పేరుతో ఎలా ఆర్డినెన్స్ తెచ్చారని ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ఒకవైపు,గ్రామాలు మరోవైపు ఉండడాన్ని అశోక్ గజపతి రాజు గమనించలేదా? అది లోపం కాదా అని ఆమె ప్రశ్నించారు. అసలెలా తెలంగాణా రాష్ట్రాన్ని ఏ మాత్రం సంప్రదించకుండా ఎలా ఆర్దినన్సు తేగలిగారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.


హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nijamabad mp kavita  ashoka gajapati raju  ordinance  

Other Articles