Telangana government will give subsidies to movie shootings says kavitha

telangana government, subsidies to shooting, trs leade kavita, kcr daughter kavita statements, kalvakuntla kavita recent statements, hyderabad shooting

telangana goverment decided to give subsidies to movie shootings in hyderabad kavitha statement

కవితలో మార్పు దేనికి సంకేతం...??

Posted: 12/26/2014 03:21 PM IST
Telangana government will give subsidies to movie shootings says kavitha

ఒకప్పుడు తెలంగాణా ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ లో షూటింగ్ చేస్తే అడ్డుకునే వారు.. వారిపై దాడులకు కూడా ఒక్కోసారి దిగేవారు. తెలంగాణా ఉద్యమ సమయంలో అలాంటి సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. కెసిఆర్ కుమార్తె కూడా షూటింగ్ లను అడ్డుకునేందుకు ధర్నాలు నిర్వహించేది. ఒక్కోసారి థానే స్వయంగా వెళ్లి అడ్డుకునేది కూడా. మీడియా స్టేట్ మెంట్ లలో కూడా ఆంధ్ర వాళ్ళు ఇక్కడ షూటింగ్ లు చేస్తే సహించేది లేదని అప్పట్లో తెగ హడావుడి చేసారు. ఆ తర్వాత తర్వాత రాష్ట్రము ఏర్పడటం మొత్తం పరిణామాలు మారటం తో ఇప్పుడు తెరాస నేతల్లో చాల మార్పు వచ్చినట్లు అనిపిస్తుంది. ముళ్ళ దారులు వేసిన చోటే పూలు పరచి కార్పెట్లు వేస్తామని అంటున్నారు తెరాస నేతలు.

ఇటీవల కెసిఆర్ కుమార్తె కవిత షూటింగ్ లు హైదరాబాద్ లో చేస్తే షూటింగ్ లు చేసే వాళ్ళకు రాయితీ ఇస్తామని ప్రకటించారు. రాయితీ ఇవ్వటమే కాక ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు కలిపిస్తామని అన్నారు. దాంతో విస్తుపోవటం విలేఖరుల వంతు అయ్యిన్దిఒ. ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళ షూటింగ్ లను అడ్డుకున్న కవిత ఇప్పుడుషూటింగ్ లకు రాయితీ కల్పిస్తానని ప్రకటించటం పట్ల మర్మమేమిటో అని ఆశ్చర్య పోతున్నారట!!

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana government  kalvakuntla kavita  shootings in hyderabad  

Other Articles