Bjp s raghubar das is all set to take oath as the new chief minister of jharkhand

raghuvar das jharkhand new cm, jharkhand new cm, raghuvar das constituency, raghuvar das cm jharkhand, jharkhand new chief minister, jharkhand cm raghuvar das, arjun munda jharkahnd, jharkhand new state

Das will be the first non-tribal chief minister if the state that was carved out of Bihar in 2000. He will replace Hemant Soren of the JMM.

జార్ఖండ్ నయా సి.ఎం రఘువర్ దాస్

Posted: 12/26/2014 02:10 PM IST
Bjp s raghubar das is all set to take oath as the new chief minister of jharkhand

ఎట్టకేలకు జార్ఖండ్ లో ఒక పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా రఘువార్ దాస్ బిజెపి అధిష్టానం ఎంపిక చేసింది. దీన్ని బిజెపి శాసనసభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలుస్తుంది.  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక గిరిజనేతరుడు, ప్రభుత్వ పగ్గాలను అందుకోవటం ఆ రాష్ట్రము ఏర్పడ్డ తర్వాత ఇదే మొదటిసారి. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్ ఎన్నిక పట్ల మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.  

భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం సమావేశం లో ఈ మేరకు రఘువర్ దాస్ ను ఎన్నుకున్నారు.జార్కండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేస్తారు.ముగ్గురు నేతలు పోటీపడగా రేసులో దాస్ ముందుకు వచ్చారు.జంషెడ్ పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన శాసనభకు ఎన్నికయ్యారు.జార్కండ్ కు తొలి గిరిజనేతర ముఖ్యమంత్రి అవుతారు. బిజెపి సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలవడంతో ఈయనకు అవకాశం దక్కింది. ఏభైనాలుగేళ్ల దాస్ డిగ్రీ చదవుకున్నారు. ఈయనపై రెండు చిన్న క్రిమినల్ కేసులో గతంలో నమోదైనట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. జార్ఖండ్ సి ఎం గా ప్రమాణ స్వీకార తేది త్వరలోనే ఖరారు చేయనున్నట్లు త్తేల్సుతుంది. దానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరవుతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jharkhand state  new cm  raghuvar das  bjp party  

Other Articles