Eminent director balachander passed away

k.balachander, balachander passes away, eminent director, Dada Saheb Phalke Award and the Padma Shri, Balachander has nine Filmfare awards to his credit. cauvery hospital, kolly wood news, tolly wood news, sandal wood news, bollywood news, balachander passed away in chennai hospital, balachander passed away in cauvery hospital, Dada Saheb Phalke Awardee balachander, Padma Shri awardee Balachander, balachander nineFilmfare awards,

Well known Tamil filmmaker K. Balachander who was admitted to a private hospital following "fever" and some "age-related ailments" passed away this evening.

ప్రముఖ దర్శకుడు బాలచందర్ కన్నుమూత

Posted: 12/23/2014 08:23 PM IST
Eminent director balachander passed away

దక్షిణాది చలన చిత్రాల ప్రముఖ దర్శకుడు సందేశాత్మక చిత్రాల తెరకెక్కించడంలో అగ్రగన్యుడు కె.బాలచందర్ పరమపదించారు. ఆయన పూర్తి పేరు కైలసం బాలచందర్. 84 ఏళ్ల ఆయన ఈ నెల 16న ఆనారోగ్యంతో చెన్నై నగరంలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మూత్రపిండాలకు సంబంధించిన సమస్య ఎక్కువ కావడంతో డయాలసిస్ చేశారు. పరిస్థితి మరింత విషమించడంతో ఆయనను చివరకు వెంటిలేటర్ మీద ఉంచి కూడా వైద్యం అందించారు. కానీ, వార్ధక్యం కారణంగా ఆయన శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో మరణించారని వైద్యులు తెలిపారు.

బాలచందర్‌కు ఎనిమిదేళ్ల వయస్సు నుంచే సినిమాలపై ఆసక్తి కలిగింది.  ఆ క్రమంలో 12వ ఏటే థియేటర్ ఆర్టిస్ట్ సంఘంలో సభ్యులయ్యారు. ఉన్నత విద్య పూర్తి చేసిన ఆయన తొలుత ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు.  చెన్నై మహానగరంలోకి అకౌంట్ క్లర్క్‌గా అడుగుపెట్టారు. ఆ తరువాత యునెటెడ్ అమెరికన్ ఆర్టిస్టు నటన కంపెనీలో చేరారు. అనంతరం అతి త్వరలోనే తన కంటూ సొంతంగా డ్రామా గ్రూప్‌ను తయారు చేసుకుని మేజర్ చంద్రకాంత్ నాటకాన్ని రూపొందించి దర్శకత్వం వహించారు. ఆ తరువాత అదే నాటకంతో వెండితెరపై దర్శకుడిగా అవతరించారు.

దక్షణాధిలో తనకంటూ స్టార్ డైరెక్టర్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న బాలచందర్ అనేక మంది ప్రముఖ నటులను సినీ ఇండస్ట్రీకి అందించారు. రజనీకాంత్, కమలహాసన్, ప్రకాష్‌రాజ్, సరిత, వివేక్ వంటి ప్రముఖ నటీనటులందరినీ వెండి తెరకు పరిచయం చేసింది ఆయనే. తమిళం, తెలుగు బాషలతో పాటు బాలీవుడ్ లోనూ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు ఆయన, అన్ని బాషలలోనూ కలిపి సుమారు 100 చిత్రాలకుపైగా ఆయన దర్శకత్వం వహించారు. భారతీయ సినీ కళామతల్లి ముద్దు బిడ్డగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలన్ని సూపర్ హిట్ కావడం మరో విశేషం.

ఎంజీఆర్‌ హీరోగా చేసిన దైవతాయ్‌ చిత్రానికి సంభాషణల రచయితగా సినీరంగంలో ప్రవేశించిన బాలచందర్.. ఇంతింతై వటుడింతై అన్న చందంగా కాలీవుడ్ లో ఎదిగారు. తన సినిమాలు కేవలం తమిళులకే పరిమితం కాకూడదని వాటిని తెలుగు, కన్నడ, మళయాలం, హందీ బాషల్లోనూ రూపొందించారు. దక్షిణాది తెలుగు చలనచిత్ర రంగానికి ఆయన చేసని సేవలకు గాను 2010 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన ఇటీవలే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘అక్కినేని అంతర్జాతీయ పురస్కారం’ అందుకున్నారు. తొమ్మిది ఫిల్మ్ ఫేర్ అవార్డలను అందుకున్నారు. పద్మశ్రీ భిరుదుతో కూడా కేంద్ర ప్రభుత్వం అయనను సత్కరించింది. ఇది కథ కాదు, అంతులేని కథ, గుప్పెడు మనసు, ఆకలి రాజ్యం, రుద్రవీణ.. ఇలాంటి అద్భుత చిత్రరాజాలన్నీ ఆయన దర్శకత్వం నుంచి జాలువారిన చిత్రాలే. ఈ చిత్రాలతో ఆయనలోని ప్రతిభను చాటిచెప్పాయి.

బాలచందర్ మరణ వార్తతో దక్షిణాది చలనచిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాలచందర్ మరణవార్తతో అటు కాలీవుడ్, టాలీవుడ్; సాండిల్ వుడ్ సహా బాలీవుడ్ లలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు బాలచందర్ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. బాలచందర్ అభిమానులు శోకసంధ్రంలో మునిగారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : k. balachander  eminent director  passed away  chennai  

Other Articles