Jharkhand and jammu kashmir election results bjp won in two states

jharkhand election results, jharkhand elections, jjharkhand assembly elections result, jharkhand pdp party results, total seats in jharkhand, jharkhand bjp party, arjun munda, arjun munda defeated by jmm and madhu koda defeated by jmm, jammu and kashmir elections results, omar abdulla, bjp party won in two states

jharkhand and jammu kashmir election results out bjp going to form the government

రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల విడుదల

Posted: 12/23/2014 07:16 PM IST
Jharkhand and jammu kashmir election results bjp won in two states

గత సార్వత్రిక లోక్ సభ ఎన్నికలలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రభంజనాన్ని సృష్టించిన బి.జె.పి.., అదే జోరును కొనసాగిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇటీవల పలు దశలలో జరిగిన రెండు రాష్ట్రాల(జమ్మూ కాశ్మీర్ మరియు జార్ఖండ్) ఎన్నికలలో బి జె పి తన సత్తా చూపించింది. జమ్మూ కాశ్మీర్ లో బి జె పి కి చెప్పుకోదగ్గ ఫలితాలు వచ్చాయి. బి.జె.పి రెండవ స్థానం లో నిలిచింది. ప్రస్తుత అధికార నేషనల్ కాన్ఫరెన్సు పార్టీ  చిత్తు చిత్తుగా ఓడిపోయింది. రాష్ట్ర ఫలితాలలో బి.జె.పి 25 స్థానాలు సాధించగా, పీడిపి పార్టీ 28 స్థానాలు సాధించింది కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం మెరుగుపడలేదు. ఆ పార్టీ 12 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నేషనల్ కాన్ఫరెన్సు పార్టీ 15 స్థానాలలో గెలిచి, మిగిలిన స్థానాల్లో అతి ఘోరమైన పరాభావాన్ని చవిచూసింది. జమ్మూకశ్మీర్ లో పీడీపీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం పీడీపీకి వస్తే మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ ఇప్పటికే ప్రకటించారు. గతంలో పీడీపీ, నేషనల్ కాన్ఫెరెన్స్ తో జట్టు కట్టిన విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు.బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలవబోమని స్పష్టం చేశారు. పీడీపీ కోసం తమ పార్టీ తలుపులు తెరిచివున్నాయని చెప్పారు.

జార్ఖండ్ లో బి జె పి తన సత్తా చాటింది.అక్కడ కాంగ్రెస్ 6 స్థానాలతో సరిపెట్టుకోగా, బి జె పి 40 స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. కాని ఆ పార్టీ కీలక నేత అర్జున్ ముండా ఓడిపోవటం ఆ పార్టీ కి చేదు అనుభవం. జె ఎం ఎం పార్టీ 19 స్థానాల్లో గెలిచి పరువు దక్కించుకుంది. జె వి ఎం పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఏది ఏమైనా రెండు రాష్ట్రాల్లో బి జె పి తన ప్రాబల్యాన్ని చాటుకుంది.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jharkhand  jammu kashmir election results  narendra modi  

Other Articles