Lady mla cries in ap assembly

Lady MLA cries in Ap Assembly, Lady MLA cries, Lady MLA cries in AndhraPradesh Assembly, Lady MLA weeps in assembly, Lady MLA weeps in AP Assembly, MLAs attack personal matters, AP Assembly uproars over personal matters, AP MLAs utilize time for personal matters, AP MLAs attack opposition personaliy, lady mla roja cries in assembly, lady mla roja weeps in assembly

Legislators bring in personal matters and make other legislator weep in the Assembly

అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యే కంట కన్నీరు ఒలికింది..

Posted: 12/22/2014 06:50 PM IST
Lady mla cries in ap assembly

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరోమారు వార్తల్లో నిలించింది. ప్రజాస్వామ్యానికి నిలువుటద్దంలా నిలిచే చట్టసభ సాక్షిగా మహిళా ఎమ్మెల్యే కన్నీరు పెట్టుకుంది. దేశంలో ఆడవారిపై మగవారు చేస్తున్న అకృత్యాలను ఖండించాల్సిన ఛట్టసభలోనే మహిళా ఎమ్మెల్యేను తమ తోటి ఎమ్మెల్యే, సహచర ప్రజాప్రతినిధురాలిగా కూడా పరిగణలోకి తీసుకోని అధికార పక్ష సహచరులు తూలనాడారు. ఓ తెలుగింట ఆడపడుచు అసెంబ్లీలో ఏడవాల్సిన దుస్థితిని తీసుకోచ్చారు. తప్పు ఎవరు చేసినా తప్పే. కానీ ప్రపంచంలోనే విభిన్నమైన సంస్కృతికి ఆలవాలైన మన దేశంలో, అందునా.. ఆడపడుచులకు గౌరవం ఇచ్చే ఆంధ్రప్రదేశ్ లో ఇలా జరగడం ఎంత వరకు సబబు.

యత్ర నార్యంతు పూజ్యంతే.. తత్ర రమ్యతే దేవతాం అని హితోక్తులు పలికే నాయకులు.. వాస్తవానికి వచ్చే సరికి ఆడపడుచుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం కూడా అసమంజసం. ఓ మహిళా ఎమ్మెల్యే చట్టసభలోనే కంట తడి పెట్టుకునేలా చేసిన సంఘటన రాష్ట్ర అభివృద్ది, సంక్షేమం దృష్ట్యా ఎలా సహేతుకం.? ఆడపడచులను గౌరవించాలని ప్రసంగాలను వల్లె వేసినంత మాత్రన.. దేశంలో మార్పు రాదు. దానిని ఆచరించి చూపాలని, అప్పుడే ప్రజలలో మార్పును తీసుకురావచ్చని విశ్వసించే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఇలా జరగడం సబబు కాదు. చట్టసభలోనే ఆడపడచు కన్నీరు పెట్టుకుంటే.. ఇక రాష్ట్రంలోని మహిళలకు టీడీపీ ప్రభుత్వం ఎలా సంరక్షిస్తుందన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నం కాక తప్పవు.

మన ఇంటి ఆడపడచును మనం ఎంత గౌరవంగా చూసుకుంటామో.. అదే విధంగా తోటి ఆడపడచులను కూడా చూసుకోవాలని చెప్పే విజ్ఞత వున్న టీడీపీ అధినేత, ప్రభుత్వాధినేత చంద్రబాబు.. సహచర ప్రజాప్రతినిధురాలిపై తన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యక్తిగత విషయాలను ప్రస్తావించి అమెను ఏడిపించేలా చేసినా.. తప్పని చెప్పక పోవడం.. శోచనీయం. అధికార పక్ష సభ్యుడు వ్యాఖ్యాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన మహిళా ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా విలపించినా.. అమెకు కనీసం క్షమాపణ చెప్పలేదు.

టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి శాసనసభలో ప్రతిపక్ష వైసీపీ పార్టీ సభ్యులపై విరుచుకుపడ్డారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రౌడీయిజం చేస్తున్నారంటూ ఒంటికాలిపై లేచిన ఆయన మహిళా ఎమ్మెల్యే రోజాపై కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వ్యక్తిగత దూషణలకు దిగారు. రోజా లేడీ విలన్ లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గోరంట్ల వ్యాఖ్యలతో నొచ్చుకున్న రోజా సభలో కంటతడి పెట్టారు. అయినా గొరంట్ల కనికరం చూపలేదు. రోజా సహా వైసీపీ పార్టీపై మాటల తూటాలను పేల్చారు. తన సహచర సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేసినా.. భరించవచ్చుకాని, మహిళపై గోరంట్ల నోరు పారేసుకోవడమే చర్చనీయాంశంగా మారుతోంది. రోజాపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన బుచ్చయ్య చౌదరి క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ సభ్యులు డిమాండ్ చేశారు.

అసెంబ్లీ రికార్డులు చూసి తప్పు ఎవరిదో నిర్ణయిద్దామని స్పీకర్ కోడెల శివప్రసాద రావు వైసీపీ సభ్యులకు సర్థి చెప్పే ప్రయత్నం చేశారు. అయినా వైసీపీ సభ్యులు శాంతించలేదు. రోజాకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తనను తిట్టడమే కాకుండా.. మాట్లాడకుండా చేశారని రోజా స్పీకర్ వద్దకు తీసుకువెళ్లారు. దీంతో స్పీకర్ మాట్లాడతూ.. అసెంబ్లీ రికార్డులు ఆధారంగా తప్పు ఎవరిదో నిర్ణయిద్దామని తెలిపారు. సభాధిపతిపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని కోడెల తెలిపారు.

తమ ఎమ్మెల్యే రోజాపై గోరంట్ల బుచ్చయ్యచౌదరి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని విపక్ష నేత వైఎస్ జగన్ తప్పుబట్టారు. తోటి మహిళా శాసనసభ్యురాలిని అవహేళన మాట్లాడితే అసెంబ్లీలో ఉండడానికి మనం అర్హులమా, కాదా అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని జగన్ అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేను స్పీకర్ కనీసం క్షమాపణ కూడా అడగకపోతే ఈ సభలో తమకు ఏ రకంగా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. గోరంట్లతో క్షమాపణ చెప్పించాలని తాము డిమాండ్ చేస్తే... సభ ముగిసిన తర్వాత ఏం మాట్లాడుకున్నారో చూస్తామనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రోడ్డు పొడుగునా ఏం జరుగుతుందో అది కూడా చూసుకుంటూ పోదామా అని జగన్ ప్రశ్నించారు.

ఇదిలావుంటే.. సమైక్య రాష్ట్ర చట్ట మండలి ఆవరణలో జరిగిన ఒక ఘటనను ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం వుంది. సమైక్యవాదాన్ని బలపరుస్తూ టీడీపీ ఎమ్మెల్సీలు పెట్టిన ప్రెస్ మీట్ ను అడ్డుకునే ప్రయత్నంలో యాధృచికంగా నన్నపనేని రాజకుమారి కిందపడగా, ఆడవారి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా.. ఆడపడచులంటే మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ విమర్శలు గుప్పించిన టీడీపీ నేతలు.. అధికారంలో వున్నామని ఇప్పుడు మహిళా ఎమ్మెల్యే రోజాపై వ్యక్తిగత దాడులకు పాల్పడతారా అంటూ పలువురు ప్రశ్నల కురిసిస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు ఎన్నిక చేస్తే.. చట్టసభల్లో వ్యక్తిగత విషయాలపై చర్చించుకుంటూ విలువైన సభా సమయాన్ని వృధా చేయడంతో పాటు.. అంతకన్నా విలువైన ప్రజాధనం వృధా చేస్తున్నారని పలువురు ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lady MLA  Roja  Opposition  cries  AP Assembly  gorantla buchaian chowdary  

Other Articles