Former union minister napoleon joins bjp says he has alagiris blessings continues bjp aakarsh

DMK leader Napoleon, actor Napoleon, napolean joins in bjp, napolean joined in bjp, rajanikanth talks with naredra modi, rajani with narendra modi, tamilnadu bjp aakarsh, tamilnadu bjp party, bjp party south

Former Union Minister and DMK leader Napoleon joins the BJP in the presence of BJP president Amit Shah, and Tamil Nadu BJP

తమిళనాట బిజెపి మంత్రం 'ఆపరేషన్ ఆకర్ష'

Posted: 12/22/2014 09:38 AM IST
Former union minister napoleon joins bjp says he has alagiris blessings continues bjp aakarsh

తమిళ నాడులో  బిజెపి ఆకర్ష కొనసాగుతుంది.  త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కొందరు సినీ ప్రముఖులు, కొందరు రాజకీయ నేతలు  బిజెపి పంచన చేరిపోతున్నారు. ఇప్పటికే తమిళ నాటనే కాకా దక్షిణాదిలోనే మంచి పేరు ఉన్న సుప్రసిద్ధ నటుడును దేశ ప్రధానే మంత్రే స్వయంగా సంప్రదించినట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన సున్నితంగా తిరస్కరించినప్పటికీ అమిత్ షా ను ఆ విషయం లో చొరవ తీసుకోవాల్సిందిగా సూచించినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏది ఏమైనా తమిళ నాడు లో ఈ  బిజెపి ఆకర్ష అందరికి అమిత ఆసక్తి ని కలిగిస్తుంది.  త్వరలోనే తమిళ రాజకీయాల్లో తనదైన శైలిలో చక్రం తిప్పిన మరో ప్రముఖ రాజకీయ నేత కూడా  బిజెపి లో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నరేంద్ర మోడీ ఇప్పటికే అమిత్ షా కు పలు సూచనలు చేసినట్లు పార్టీ వర్గాలు గుస గుసలాడుకుంటున్నాయి. ఏది ఏమైనా నరేంద్ర మోడీ సూచనలతో అమిత్ షా ఎత్తులతో తమిళ నాట  బిజెపి బలంగా తయారవుతున్నదని స్థానిక బిజెపి వర్గాలు భావిస్తున్నాయి. త్వరలో జరగనున్న ఎన్నికలలో   బిజెపి తన ఆధిక్యాన్ని కనబరిచే అవకాశలున్నట్లు రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.    

నిన్న తమిళ నాడులో పర్యటించిన అమిత్ షా పర్యటన సందర్భంగా కొందరు నేతలు కూడా  బిజెపి లో చేరినట్లు తెలుస్తుంది. తమిళనాడులో మరో ప్రముఖ నటుడు బిజెపిలో చేరారు. నెపోలియనే అనే ప్రముఖ నటుడు డి.ఎమ్.కె.కి గుడ్ బై చెప్పి బిజెపి అద్యక్షుడు అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరారు. ఆయన డి.ఎమ్.కె.తరపున కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. పార్టీ అధినేత కరుణానిధి కుమారుడు అళగిరి కి అనుచరుడుగా ఉన్నారు. అళగిరిని పార్టీనుంచి సస్పెండ్ చేశాక ఆయన మద్దతుదారులు వేరే పార్టీలలోకి వెళుతున్నారు. ఈ నేపధ్యంలో నెపోలియన్ మాట్లాడుతూ డి.ఎమ్.కె.గాడి తప్పిందని వ్యాఖ్యానించారు. ఇంకోదరు ప్రముఖులు కూడా  బిజెపి లోకి రావటానికి ఆసక్తి కనబరుస్తున్నారని తమిళ నాట  బిజెపి మోడీ మార్గదర్శకత్వం లో బలమైన పార్టీగా అవతరిస్తుందని చెప్పారు.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actor napolean  bjp party tamilnadu  dmk leader napolean  amit sha  naredra modi  

Other Articles