Chandrababu naidu wants 6 more months to shift from hyd

chandrababu wants to shift from hyderabad, babu gives chalo vijayawada call, TDLP meeting, Telugu Desam Legislature Party, 4,5 months to rule from vijayawada, govern AP from vijayawada, shift few departments to Vijayawada immediately, Andhra pradesh chief minister chandrababu, Andrapradesh capital, chandrababu camp office, vijayawada

In a move to fasten the works related to new capital of the truncated Andhra Pradesh, Chandrababu Naidu has given a call for Chalo Vijayawada. Naidu is toying with the idea to govern the state AP from Vijayawada as early as possible.

త్వరలోనే విజయవాడ నుంచి రాష్ట్రపాలన

Posted: 12/18/2014 11:50 PM IST
Chandrababu naidu wants 6 more months to shift from hyd

చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్‌-జూన్‌ మధ్యలో ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో తాత్కాలిక సీఎం క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు టీడీపీఎల్పీ సమావేశంలో చంద్రబాబు స్పష్టం చేశారు. రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఏపీ పాలనను కొత్త రాష్ట్రం నుంచి సాగించాలన్న అంశం చర్చకు వచ్చింది. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ కొత్త రాజధానిలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి, కొత్త శాఖలను అక్కడికి తరలిద్దామని తెలిపారు.
 
వీలైనంత త్వరలో ఏపీ నుంచి పాలన కొనసాగించేలా కృషి చేద్దామన్నారు. ఇకపై హైదరాబాద్‌ రాజకీయ రాజధానిగా మాత్రమే ఉంటుందని బాబు తెలిపారు. జనవరి నుంచి ప్రతీ శనివారం శాసనసభ్యులకు సమయం కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించారు. మంత్రులు కూడా ఆ సమయంలో శాసనసభ్యులకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. అలాగే ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలపైనా సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. రుణమాఫీ, పెన్షన్ల పథకాన్ని ప్రచారం చేసుకోలేకపోతున్నామని, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు. కొందరు రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఏపీలో ఆత్మహత్యలపై సమాచారం తెప్పిస్తున్నామన్నారు. బాధిత కుటుంబాలకు అప్పులు ఉంటే పూర్తిగా మాఫీ చేసి కొంత ఆర్థిక సాయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమావేశంలో వెల్లడించారు.
 
బినామీలకు రుణమాఫీ వార్తలపై ఎమ్మెల్యేలు దృష్టి సారించాలని సూచించారు. 50 గజాలలోపు స్థలాలను క్రమబద్దీకరించే యోచనలో ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు. వైసీపీ నేతలు తూ.గో జిల్లాకు వెళ్లి పోలవరం నుంచి నీళ్లను రాయలసీమకు ఎలా తరలిస్తారని ప్రశ్నిస్తున్నారని, అదే విషయాన్ని రాయలసీమకు వెళ్లి చెప్పగలరా అన్ని సీఎం ప్రశ్నించారు. పోలవరం విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని చంద్రబాబు నాయుడు అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  Vijayawada  TDP  Telangana  Hyderabad  AP Capital  

Other Articles