High court allowed registrations in vgtm uda area

high court allowed registrations, high court allows registrations in uda, high court says government to prepare masterplan first, VGTM, High court, VGTM UDA area, AP Capital, registrations

high court allowed registrations in vgtm uda area, untill the master plan is ready for new capital

నవ్యాంధ్ర రాజధానిలో భూముల లావాదేవీలు యదాతథం

Posted: 12/18/2014 11:40 PM IST
High court allowed registrations in vgtm uda area

విజయవాడ గుంటూరు సరిహద్దు ప్రాంతంలో నవ్యాంధ్ర రాజధానిని నిర్మించాలని యోచిస్తూ, రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది.  విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి (వీజీటీఎం) ఉడా పరిధిలో రిజిస్ట్రేషన్లు యథావిథిగా చేసుకోవచ్చని హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ కొత్త రాజధాని ప్రాంతం వీజీటీఎం ఉడా పరిధిలోకి రావడంతో ఆ పరిధిలోని భూముల రిజిస్ట్రేషన్లు, లేఅవుట్, గ్రూప్ హౌసింగ్స్ను నిషేధిస్తూ  ఏపీ ప్రభుత్వం  మెమో జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.  

ఆ పిటిషన్ను విచారించిన హైకోర్టు ఆ మెమోను సస్పెండ్ చేస్తూ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రాజధాని మాస్టర్ ప్లాన్ వచ్చే వరకు భూ రిజిస్ట్రేషన్లు ఆపాలన్న జీఓపై విచారణ కొనసాగుతుంది. అయితే ఈ తీర్పుతో మళ్లీ రాజధాని ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు ఊపందుకోనున్నాయి. రాష్ట్రోన్నత కోర్టు ఈ అంశంపై విచారణ జరుపుతున్న నేపథ్యంలో విచారణ పూర్తయ్యే వరకు కొనుగోళ్లు, అమ్మకాలు కాస్త మందకొడిగానే సాగనున్నాయి. ఈ అంశంలో న్యాయస్థానం తుది తీర్పును ఏ మేరకు ఉంటుందన్న అంశంమై సర్వత్రా ఆసక్తి కోనసాగుతోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High court  VGTM UDA area  AP Capital  

Other Articles