Gali janardhan reddy gets bail in bribe for bail case

Gali Janardhan Reddy gets bail, high court grants bail to Gali Janardhan Reddy, Gali Janardhan Reddy got bail, Gali Janardhan Reddy bribe-for-bail case, former Karnataka minister Gali Janardhan Reddy gets bail, Gali Janardhan Reddy gets bail in bribe-for-bail case.

The Hyderabad High Court today granted bail to the former Karnataka minister Gali Janardhan Reddy in the bribe-for-bail case.

బెయిల్ డీల్ కేసులో గాలి జనార్థన్ రెడ్డికి బెయిల్

Posted: 12/18/2014 11:43 PM IST
Gali janardhan reddy gets bail in bribe for bail case

బెయిల్‌ డీల్‌ కేసులో గాలి జనార్ధన్‌ రెడ్డికి హైకోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. మైనింగ్‌ అక్రమ తవ్వకాల కేసులో అరెస్టుయిన గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్‌ తీసుకునేందుకు అక్రమ మార్గం ద్వారా ఓ జడ్జీతో రూ. 2 కోట్లు డీల్‌ కుదుర్చుకున్నారు. ఈ కేసులో రౌడీ షీటర్‌ యాదగిరితోపాటు మరి కొందరు సహకరించారు. కేసు విచారణ సమయంలో తాత్కాలికంగా ఉన్న న్యాయమూర్తి పట్టాభి గాలి జనార్థన్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేశారు.
 
తర్వాత ఈ బెయిల్‌కు సంబంధించి అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు చేయడంతో బెయిల్‌ విషయంలో అక్రమాలు జరిగాయని నిర్థారణ కావడంతో మళ్లీ గాలి జనార్ధన్‌రెడ్డితోపాటు న్యాయవాది, రౌడీ షీటర్‌ను అరెస్టు చేయడం జరిగింది. తర్వాత ఒక్క గాలికి తప్ప మిగిలిన వారికి బెయిల్‌ లభించింది. గురువారం జరిగిన విచారణలో గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ డీల్‌ విషయంలో కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. కాగా మైనింగ్‌ కేసులో ఇంకా బెయిల్‌ మంజూరు కానందున గాలి జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం లేదు. ప్రస్తుతం ఆయన బెంగుళూరు జైల్లో ఉన్నారు. ఒక్క మైనింగ్‌ కేసులో తప్ప... గాలి జనార్థన్‌రెడ్డిపై ఉన్న అన్ని కేసుల్లో బెయిల్‌ లభించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High court  Gali Janardhan Reddy  bribe-for-bail case  

Other Articles