Brutal south delhi murder 18 year old boy found headless heart ripped out some private parts missing

delhi murder, delhi murder case, found a dead body in delhi, found a dead body head less, delhi recent incidents, delhi murder incidents, fathepuri murder, murder case

panic gripped south Delhi's Fatehpur Beri area on Thursday after body of a youth chopped in three pieces was recovered from a nearby jungle close to Bhatti Mines.

ఢిల్లీలో మరో సంచలనం....

Posted: 12/12/2014 05:46 PM IST
Brutal south delhi murder 18 year old boy found headless heart ripped out some private parts missing

ఢిల్లీ జరుగుతున్న వరుస సంఘటనలు కలకలం రేపుతున్నాయి. గత వారంలో దేశ రాజధాని నడి మధ్యలో జరిగిన అత్యాచార సంఘటన వేడి చల్లారక ముందే ఈ రోజు వెలుగులోకి వచ్చిన సంఘటన పెను భయోత్పాతాన్నిసృష్టించింది.

దక్షిణ ఢిల్లీ లోని ఫతేపూర్ బేరి ప్రాంతంలో ముక్కలు ముక్కలుగా పడి ఉన్న మృత దేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ లు ఆ మృత దేహాన్ని చూసి అవాక్కయ్యారు. ఆ మృత దేహం ముక్కలు ముక్కలుగా కోసి గుండెని బయటకు తీసి, మెడపై రాళ్ళతో మోదినట్లుగా ఒళ్ళు గగుర్పుడిచే రీతిలో ఉంది. మరియు ఆ మృతదేహం లోని కొన్ని ఆంతరంగిక భాగాలు పెకిలించి వేసినట్లుగా ఉన్నాయి. వెంటనే వాటిని సేకరించి ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపారు.  

తర్వాత పోలీస్ ల విచారణలో ఆ మృతదేహాన్ని  18 సంవత్సరాల కులదీప్ కుమార్ అనే ఒక యువకుడిగా గుర్తించారు. అతను అదే ప్రాంతం లోని సంజయ్ కాలనీ లో ఉంటున్నాడు. గుర్గావ్ ప్రాంతంలో కొరియర్ బాయ్ గా పని చేస్తున్నాడు. కొరియర్ బాయ్ గా చేరి ఒక వారమే అవుతుందని పోలీస్ విచారణలో తేలింది. అంతకు ముందే కులదీప్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో తమ అబ్బాయి కనబడటం లేదని ఫిర్యాదు చేసి ఉన్నారు. గత బుధవారం ఇంట్లో నుండి బయల్దేరిన కులదీప్ తన స్నేహితులను కలిసి వస్తానని చెప్పి ఇంతవరకు రాలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకొన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles