Kim kardashian mother kris jenner marriage with boyfriend corey gamble

kris jenner marriage, kris jenner corey gamble marriage, kris jenner corey gamble love photos, corey gamble younger than kris jenner, corey gamble age, kim kardashian on mother marriage, kim kardashian latest photos, latest news updates

kim kardashian mother Kris Jenner marriage with boyfriend Corey Gamble : popular tv anchor cum model kim kardashian to face question from world about her mother marriage, kim kardashian mother kris jenner to marry her boy friend corey gamble younger than her

చిన్న పిల్లాడితో కిమ్ కర్దాషియన్ తల్లి పెళ్లి

Posted: 12/08/2014 01:38 PM IST
Kim kardashian mother kris jenner marriage with boyfriend corey gamble

ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరిలో ఎవరు, ఎవరికి ఆదర్శమో తెలియదు కానీ.., ఒకరిని మించి మరొకరు సంచలనాలు చేస్తున్నారు. కిమ్ బహుశా తల్లి నుంచే ఈ విద్యను నేర్చకుంది కాబోలు. బట్టలేసుకుందా అని డౌట్ వచ్చేలా ఫోటోలు దిగే మోడల్ గా హాట్ బాబులకు కిమ్ చాలా సుపరిచితురాలు. బరి తెగింపు అనుకున్నా.. భయం లేదు అనుకున్నా పట్టించుకోను అని కిమ్ చెప్తుండేది. ఈ చేష్టలకే ఇలా అయితే.., ఆమె తల్లి చేస్తున్న పనులు తెలిస్తే షాక్ తో తల పట్టుకోవటం ఖాయం.

కిమ్ తల్లి, ప్రముఖ రియాల్టి షో స్టార్ క్రిస్ జెన్నీర్ త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. బాయ్ ఫ్రెండ్  కోరి గ్యాంబెల్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న క్రిస్ రింగు తొడిగించుకునేందుకు రెడి అవుతోంది. తల్లికి పెళ్లి అంటేనే వినటానికి విడ్డూరంగా ఉంది కదా. ఇక్కడినుంచి ఇంకా షాకులు తగులతాయి. ఆరు పదుల వయస్సున్న క్రిస్ చేసుకునేది తనకంటే చిన్నవాడిని. మామూలు చిన్నవాడు కాదండోయ్.., కోరీ గ్యాంబెల్ ప్రస్తుత వయస్సు మహా అయితే 34 సంవత్సరాలట. అంటే దాదాపు సగం వయస్సు తక్కువ. ఇంకో షాకు ఏమిటంటే.., కిమ్ కర్దాషియన్ కంటే కూడా కోరీ చిన్నవాడు.

కూతురుకంటే చిన్న వయస్సుండే వ్యక్తిని ప్రేమించటమే కాక.., పెళ్ళికి కూడా సిద్దపడటంతో అంతా నోరెళ్లబెడుతున్నారు. అటు కోరి కూడా పెళ్ళి మాట ఎత్తితే ముసి ముసిగా సిగ్గు పడుతున్నాడు (సిగ్గులేకుండా). ఎలాగూ పెళ్ళి చేసుకుంటున్నాం కదా అని కోరిని ఇంటికి తీసుకెళ్ళి హి ఈజ్ మై నెక్స్ట్ హస్బెండ్ అని కిమ్, ఇతర కుటుుంబ సభ్యులకు పరిచయం చేసిందట. ప్రస్తుతం కోరీ బాగోగులు అంతా క్రిస్ చూసుకుంటోందట.

క్రిస్ జెన్నర్ కు గతంలోనే పెళ్ళి అయింది. కాని ఫారిన్ లో కామన్ అయిన కారణం చెప్పి బ్రూస్ తో  ఉన్న 23 సంవత్సరాల వివాహ బంధాన్ని ముగించింది. కొత్త అకౌంట్ తెరిచేసి గ్యాంబెల్ ను పర్మనెంట్  చేసుకోవాలని చూస్తోంది. కాని ఈ వ్యవహారం కిమ్ కర్దాషియన్ ఆమె సోదరి కర్టీ కర్దాషియన్ కు నచ్చటం లేదు. తమకంటే చిన్నవాడు తమ తల్లికి భర్త అవుతాడు అనే విషయం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ప్రేమలో మునిగి తేలుతున్న క్రిస్ కు ఈ విషయం అర్థం కావటం లేదు.  ఈ లేటు వయసు ఘాటు ప్రేమ కథ చివరకు ఎటు వెళ్తుందో.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kris jenner marriage  corey gamble age  kim kardashian latest  

Other Articles