Chiranjeevi appeals to please put on seat belt while driving car

chiranjeevi appeals public, chiru says to put on seat belt, NH 65 road accident, road accident on national Highway, Nandamuri janakiram, Hari krishna, chiru tribute to janakiram, chiranjeevi pays tribute to janakiram, pavan kalyan condolence to janakiram, chiranjeevi appeals public to put on seat belt

chiranjeevi appeals to please put on seat belt while driving car

దయచేసి సీటుబెల్టు పెట్టుకోండి.. చిరు పిలువు

Posted: 12/07/2014 07:47 PM IST
Chiranjeevi appeals to please put on seat belt while driving car

నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించడం దురదృష్టకరమని మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. అయినా విధి రాతను ఎవరూ తప్పించుకోలేరని ఆయన పేర్కోన్నారు. సీటు బెల్ట్ పెట్టుకోకుని వుండి వుంటే మరణం సంభవించి వుండేది కాదేమోనని అభిప్రాయపడ్డారు. సీటు బెల్టు పెట్టకోకపోవటం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. సామాజిక బాధ్యత గల వ్యక్తులుగా .. సీటు బెల్ట్ను పెట్టుకోగలిగితే ...ఇలాంటి ప్రమాదాలను ఎంతోకొంత తప్పించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.

చిరంజీవి ఆదివారం ఉదయం  జానకిరామ్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. నందమూరి హరికృష్ణను పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసిమెలిసి ఉండే హరికృష్ణకు... ఇది రాకూడని కష్టమన్నారు.  ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదన్నారు. జానకిరామ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యం చేకూరాలని  కోరుకుంటున్నట్లు చిరంజీవి చెప్పారు.

ఇటువంటి సంఘటనలు చూసి అయినా సరే కారు నడుపుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ  సీటు బెల్ట్ పెట్టుకోవాలని ఆయన తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రమాదాల బారిన పడినవారి కుటుంబాలు ఎంతలా మనోవేధనకు గురవుతాయో.. తెలుసుకోవాలన్నారు. తల్లిదండ్రులు, కుటంబ సభ్యులు కన్నీళ్లు ఇంకిపోయేలా శోకంలో మునిగినా..  పోయినవారు తిరిగి రారన్నారు. కారు ఎక్కగానే ముందుగా సీటు బెల్టు పెట్టుకోవడం అలవర్చుకోవడం మంచిదని చిరంజీవి సూచించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri janakiram  chiranjeevi  appeal  

Other Articles