Supreme court upholds prisoners vote right

Supreme court upholds prisoners' vote right, quashes amendment to RP Act 1951, allowing person in custody to vote, allowing person in custody to elect, amendment to Section 62(5), prohibit custody persons vote, prohibit custody persons to contest elections.

supreme court had sought quashing of the amendment to the Representation of the People Act, 1951, allowing a person in custody to vote and be elected as a member of Parliament or a state Assembly., Prior to the amendment, Section 62(5) of the act prohibited persons in custody from casting their vote and contesting elections.

శిక్ష పడనంతవరకు ఎంపీ, ఎమ్మెల్యే కావచ్చు..

Posted: 12/06/2014 01:50 PM IST
Supreme court upholds prisoners vote right

వివిధ కేసులలో నిందితులుగా ఉన్న నేతలకు సర్వోన్నత న్యాయస్థానం శుభవార్తను అందించింది. శిక్ష విధించబడేంత వరకు జైళ్లల్లో ఉన్నా, బెయిల్‌పై ఉన్నా మీరు ఎన్నికలలో పోటీ చేసేందుకు సుప్రీం ధర్మాసనం హక్కు కల్పించింది. ఎవరైనా అభ్యర్థి జైలులో ఉన్నా, పోలీసు కస్టడీలో ఉన్నా చట్టసభలకు పోటీ చేసే హక్కు లేదంటూ గత ఏడాది జూలైలో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. భారత ఎన్నికల వ్యవస్థ గుండాలను కూడా రాజకీయాల్లోకి వచ్చేలా చేస్తోందని మండిపడిన న్యాయస్థానం జైలులో వున్నావారికి ఓటు హక్కుతో పాటు వారు ఎన్నికలలో పోటీ చేయకుండా సవరణలు చేసింది. భారత రాజ్యాంగంలో సెక్షన్ 62(5) కింద ఏదేని నేరాలకు పాల్పడి జైలులో గాని, బెయిల్ పై వున్నాగానీ వారికి ఓటుతో పాటు ఎన్నికలలో నిలబడే హక్కు కూడా లేదని సవరణలు చేసిందిజ

అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశంతో జైలులో గడిపిన, గడుపుతున్న నేతలకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కల్పిస్తూ అప్పటి యూపీఏ సర్కార్‌ రాజ్యాంగ సవరణ తీసుకువచ్చింది. శిక్షపడిన వారు తప్ప.. జైళ్లలో గడిపినవారిని ఎన్నికలలో పోటీ చేసేందుకు అనుమతిస్తూ ప్రజాప్రాతినిధ్య చట్టానికి చేసిన రాజ్యాంగ సవరణను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యాన్ని సుప్రీం కోర్టు ధర్మాసనం కొట్టివేసింది. చీఫ్‌ జస్టిస్‌ దత్తు నేతృత్వంలో జస్టిస్ ఏ కే సిక్రీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ‘‘ఒక వ్యక్తికి శిక్ష పడినా, దోషిగా నిర్ధారణ జరిగినా మేము అర్థం చేసుకుంటాం. అయితే ఎఫ్‌ఐఆర్‌ నమోదైనంత మాత్రాన, జైలులో నిర్బంధంలో గడిపినంత మాత్రాన ఆ వ్యక్తికి ఎన్నికలకు అర్హత లేకుండా చేయడం సరికాదు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme court  PIL  prisoners vote right  person in custody  convicted inmates  

Other Articles