Devendra fadnavis delivers a new year shock to people of maharastra

Devendra Fadnavis Government, Withdraws Rs 8.4cr subsidy, residential and commercial consumers, Congress-NCP government, Electricity Regulatory Commission, general elections, maharastra Government, Maharashtra Electricity Regulatory Commission (MERC), increase electrical tariff, increase in tarrif from March 2015, MSEDCL, Power tariff, Prakash Mehta, State government, previous state government

Devendra Fadnavis delivers a shocker, power tariffs to go up by 35% next year, Withdraws Rs 8.4cr subsidy given to residential and commercial consumers

మహారాష్ట్ర వాసులకు సీఎం పెడ్నవిస్ న్యూయిర్ షాక్..

Posted: 12/06/2014 12:27 PM IST
Devendra fadnavis delivers a new year shock to people of maharastra

రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని, ఈ నెల 8 నుంచి శీతాకాల సమావేశాలకు వెళ్లనున్న తరుణంలో మహారాష్ట్రలోని తొలి బీజేపి ప్రభుత్వం.. రాష్ట్రవాసులకు కొత్త సంవత్సరం సందర్భంగా షాక్ ఇవ్వనుంది. మహారాష్ట్రలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు, ఆంకాంక్షలు పెట్టుకున్న మహారాష్ట్రవాసులకు న్యూ ఇయర్ సందర్భంగా చేదు వార్తను అందించనుంది. మహారాష్ట్రలో గత కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వం గృహ, వాణిజ్య వినియోగదారులకు కల్పించిన విద్యుత్ రాయితిని ఎత్తివేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు తొమ్మిది నెలల ముందు గత కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వం రాజధాని సహా శివారు ప్రాంత వాసులకు విద్యుత్ రాయితీని ప్రకటించింది. సుమారు 8 వేల 472 కోట్ల రూపాయల రాయితీని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు గాను ప్రతి నెల 706 కోట్ల రూపాయలను 12 నెలల పాటు విద్యత్ రెగ్యులేటరీ కమీషన్ కు ఇచ్చందుకు అంగీకరించింది. ఈ రాయితీ వచ్చే ఏడాది ఫ్రిబవరితో ముగియనున్న తరుణంలో సుమారుగా పద్నాలుగు వందల 12 కోట్ల రూపాయల మినహాయింపును ప్రభుత్వ ఎత్తివేస్తూ నిర్ణయిం తీసుకుంది

దీంతో విద్యుత్ చార్జీలు 20 శాతం మేర పెరగనున్నాయి. వచ్చే ఏడాది జనవరి మాసం నుంచి కోత్తగా పెరిగిన విద్యుత్ చార్జీలు అమల్లోకి రానున్నాయి. దీనికి తోడు మహారాష్ట్ర విద్యుత్ రెగ్యూలేటరీ కమీషన్ విద్యుత్ చార్జీలను సుమారు 15 శాతం మేర పెంచాలని ప్రభుత్వానకి ఇప్పటికే నివేదికలను అందజేసింది. దీనికి కూడా పెడ్నవిస్ ప్రభుత్వం అమోదం తెలపడంతో మహారాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ దరలు 35 శాతం పెరగనున్నాయి. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే తమకు బీజేపి ప్రభుత్వం కొత్త సంవత్సరం సందర్బంగా వాతలను ఇచ్చిందని మహారష్ట్ర వాసులు ప్రబుత్వ నిర్ణయంపై మండిపడుతున్నారు.

కాగా మహారష్ట ముఖ్యమంత్రి దేవెంద్ర పెడ్నవిస్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. రాయితీలతో పరిశ్రమలకు నష్టం వస్తుందంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆద్వర్యంలో నడుస్తున్న విద్యుత్ ప్రాజెక్టులు మరింత ఆదాయన్ని ఆర్జిస్తే.. వాటి ఫలాలు వచ్చే ఏడాది వచ్చే టారిఫ్ పై ప్రభావాన్ని చూపుతాయన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles