Tejas aircraft to be commissioned soon says manohar parrikar

Tejas aircrafts, defence minister Manohar Parrikar, Tejas indigenously Light Combat, replacing MIG fighters, DRDO, millitants hidden in bunker, jammu and kashmir millitant attack, encounter, gunfight, jammu Kashmir, militants

As many as 20-30 indigenously built Light Combat , which will replace the aging MIG fighters, will be commissioned soon, government informed the Lok Sabha. Defence Research and Development Organisation (DRDO) is working on the Light Combat Aircraft Tejas Programme, which has been running behind schedule.

బంకర్ లో నక్కిన ఉగ్రవాదులను ఏరివేస్తాం..

Posted: 12/05/2014 04:17 PM IST
Tejas aircraft to be commissioned soon says manohar parrikar

భారత యుద్దరంగంలో కొత్త యుద్ద విమానాలు రాబోతున్నాయి. పూర్తి స్వేదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న తక్కువ బరువుతో వుండే తేజస్ యుద్దవిమానాలను భారత్ సిద్దం చేస్తున్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే 20 నుంచి 30 నూతన యుద్ద విమానాలు భారత రక్షణ రంగంలోకి రానున్నాయని తెలిపారు. వయోభారంతో ఇప్పటికీ సేవలందిస్తున్న మిగ్ యుద్ద విమానాల స్థానంలో నూతన యుద్ద విమానాలు సేవలందిస్తాయని తెలిపారు.

రక్షణ పరిశోధనా, అభివృద్ది సంస్థ డీఆర్డీఓ తేజస్ యుద్దవిమానాల తయారీలో నిమగ్నమైందని తెలిపారు. అవి పరీక్షలు విజయవంతం కాగానే మిగ్ యుద్దం విమానాల స్థానంలో తేజస్ లను భర్తీ చేస్తామన్నారు. ఐదో తరంలో వస్తున్న నిగూడ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన దాడులను మిగ్ యుద్దవిమానాలు గుర్తించే అవకాశం లేదని, రాడర్లకు కూడా అందకుండా అత్యంత పై నుంచి ఎగరడంలో తేజ్ యుద్ద విమానాలు దాడులు చేపడతాయన్నారు. జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో బారాముల్లా జిల్లా యూరీ సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ లోక్ సభలో ప్రకటన చేశారు. దాడికి పాల్పడ్డ ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చామని వెల్లడించారు.

బంకర్లో దాగిన మిగిలినవారిని కూడా ఏరివేస్తామని పారికర్ చెప్పారు. తీవ్రవాదుల దాడిలో ఏడుగురు జవాన్లు, ముగ్గురు పోలీసులు మరణించినట్టు తెలిపారు. ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరుపుతూ, యూరీ సెక్టార్‌లోని ఓ బంకర్‌లోకి చొరబడ్డారు. వారిని బయటకు రప్పించడానికి సైనికులు రంగంలోకి దిగారు. బంకర్‌లో భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని అధికార్లు వెల్లడించలేకపోతున్నారు. ఉగ్రవాదులు ఉన్న బంకర్‌ను దిగ్బంధం చేసినట్లు చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DRDO  defence minister  Manohar Parrikar  Tejas Aircrafts  

Other Articles