Haryana government puts bravery award for rohtak sisters on hold

Haryana government bravery award, Rohtak sisters awards hold, Rohtak sisters bravery awards, violence against women, Haryana government, crime against women

Haryana government has decided to put a hold on its recommendation of bravery awards to the two Rohtak sisters for fighting against alleged ever-teasers. The decision comes after doubts were raised over the version of events that were narrated by the girls.

సాహస బాలికల రివార్డు రివర్స్.. యువకులకు రిలాక్స్

Posted: 12/05/2014 03:07 PM IST
Haryana government puts bravery award for rohtak sisters on hold

హర్యానా సాహస అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వం ప్రకటించిన రివార్డు నిలిచిపోయాయి. సాహస అక్కాచెల్లళ్లకు ఇవ్వాలనుకున్న రివార్డు రివర్స్‌ అయింది. ఆ యువకులు నిందితులు కాదు.. ‘అమాయకులు’ అని ప్రయాణికులలోని  నలుగరు యువతులు సాక్ష్యమివ్వడంతో హర్యానా ప్రభుత్వం రివార్డును తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు సీఎంవో ఓఎస్డీ ప్రకటించింది. ఇటీవల ఓ బస్సులో తమను వేధించిన ముగ్గురు యువకులను ఆర్తీ, పూజ అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. బెల్టుతో విచక్షణా రహితంగా కొట్టారు. అయితే ఈ ఘటన పెద్ద దుమారమూ చెలరేగి దేశవ్యాప్తంగా పెను సంచలమైంది. సాహస అక్కాచెలెళ్ల ధైర్యసాహసాలకు మొచ్చుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వం సాహస అవార్డులను ప్రకటించింది. అదీనూ వచ్చే ఏడాది గణతంత్ర్య దినోత్సవం రోజున వారికి అవార్డులను అందించేందుకు సిద్దమైంది. ఈ లోగా ఈ అక్కా చెలెళ్ల మరో వీడియో బయటకు వచ్చింది. దీంతో వారిపై కొన్ని విమర్శలు వెల్లువెత్తాయి.

తోటి ప్రయాణికుల సాక్ష్యాలను హర్యానా రోహ్ తక్ పోలీసులు సేకరించారు. యువకులది తప్పలేదని, అక్కాచెలళ్లదే తప్పని వారి దర్యాప్తులో తేలింది. దీంతో నివేదికను ప్రభుత్వానికి పంపగా.. వారికి ప్రకటించిన అవార్డులను ముందుగా నిలిపివేశారు. తోటి ప్రయాణికులు, అక్కా చెలెళ్ల గ్రామం అసాన్ నికి చెందిన యువతుల ఇచ్చిన సాక్ష్యంతో నిందితులుగా భావించిన ముగ్గురు యువకులు కుల్దీప్‌, మోహిత్‌, దీపక్‌లకు కాస్త ఊరట లభించినట్లైంది. వారు ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని, అమాయకులని చెప్పడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేసును మరింత విచారించాకే ముందుకు పోతామని అధికారులు చెప్పారు. అరెస్టయిన ముగ్గరు యువకులు బెయిల్‌పై విడుదల అయ్యారు. కాగా, సంఘటనపై సంబంధం లేకున్నా ఆ బస్సులో విధులు నిర్వర్తిస్తున్న పాపానికి ఆ బస్సు డ్రైవర్‌, కండక్టర్లను సస్పెండ్‌ చేసిన మహారాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rohtak sisters  bravery award  haryana government  

Other Articles