10 totally opposite animals build a true friendship love has no bounds humans need to learn from this

race rivalary, bond to form together, friendship, Totally Opposite Animals, Build, A True Friendship, Love, Bounds,. Humans, Need To Learn

10 Totally Opposite Animals Build A True Friendship. Love Has No Bounds. Humans Need To Learn From This.

జాతి వైరాన్ని మరచి స్నేహం.. అపూర్వం.. అద్భుతం..

Posted: 12/03/2014 06:14 PM IST
10 totally opposite animals build a true friendship love has no bounds humans need to learn from this

అవి మూగ జీవాలు.. ఎలా కలిసాయో తెలియదు కానీ.. జాతి వైరాన్ని మరచి కలసిమెలసి జీవిస్తూ.. స్నేహంలో వున్న మాధుర్యాన్ని అనుభవిస్తున్నాయి. ప్రేమిస్తే.. పోయేదేమీ లేదు.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అన్న సినిమా డైలాగ్ ను నిజం చేస్తూ జన్మతహా వచ్చిన వైరాన్ని మరచి జీవిస్తున్న మూగ జీవాలను చూసి మనిషి చాలా నేర్చుకోవాలి. విజ్ఞానం వుంది, వివేకం వుంది, మంచి చెడులు ఆలోచించే సృహ కూడా వుంది. అయినా మనిషికి మనిషంటేనే పడదు. ఒకే జాతికి చెందినా..మానవుడికీ మానవుడి మధ్య ఎన్న బేధాలు.. అంతరాలు..

కులం, మతం, ప్రాంతం, వర్ణం.. కట్టుబాట్లు, సంప్రదాయాలు, సంస్కృతులు ఇలా ఎన్నెన్నో.. అడ్డుగోడలు. మనమంతా మానవులం అనుకుని ఎలుగెత్తి చాటే.. వివేకమున్నా..వాటిని పక్కనబెట్టి మన పట్టింపులకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాం. ఇవి చాలదన్నట్లు.. మన వివేకాన్ని ధనవంతుడు, పేదవాడు, చదువుకున్న వాడు, నిరక్షరాస్యుడు, నగరీకరణ అలవాటు పడిన వాడు, పల్లెటూరి వాడు, ఇలా కూడా అడ్డుగోడలు సృష్టించేందుకు వినియోగిస్తున్నాం.

అన్నదమ్ముల మధ్య భిన్నాభిప్రాయాలతో విడిపోవడం, అస్తి తగాదాలతో ఒకరికొకరు మాట్లాడుకోక పోవడం, భార్యభర్తలు విడాకులు తీసుకోవడం, పాక్షన్ రాజకీయాలతో హత్యలు చేయడం, అప్పటి వరకు తన వర్గం వాడు అవతలికి వెళ్లడంతో వాడిపై పగ పెట్టుకోవడం ఇలాంటి వన్నీ మానవుడు అతి తెలివితో ఏర్పర్చుకుంటున్న అడ్డుగోడలే.. మూగ జీవాలే జాతి వైరం మరచి ఒక్కటై సక్యతతో మెలుగుతున్నప్పడు.. అరుణగ్రహం మీదకు తోకచుక్క మీదకు వెళ్లిన మనిషి మాత్రం అంతరాలను పెంచుకోవడం సహేతుకమా మీరే చెప్పండి..

1. శునకమే అయినా చూసారా చిన్నారి వరాహాన్ని ఎలా దరిచేర్చుకుందో.. ఎలా ముద్దాడుతోందో... ఇక వరాహానికి ఏం భయం..

Animals-Build-1

 

2. పాపురాళ్లు సందేశాలకు, ప్రేమకు, శాంతికి చిహ్నమని తెలుసుకుందో ఏమో.. ఈ వానరం దానితో మైత్రి కోనాసాగిస్తోంది.

Animals-Build-2

 

3. ఏదైనా పెద్ద సమస్య వచ్చిందనుకోండి.. ఇంట్లో వున్న పెద్దలు పులినోట్లో తలపెట్టావుగా అంటూ చమత్కరిస్తుంటారు.. కానీ అదేమీ సమస్య కాదు అంటూ ఈ పెద్దపులిని ఆప్యాయంగా కౌగలించుకుంటున్న వానరాన్ని చూస్తే అర్థమవవుతోంది.

Animals-Build-3

 

4. త్రివర్ణ కలయిక అంటే ఇదేనేమో.. శునకం, దాని పక్కన పిల్లి వాటిపై చిన్ని కోడి పిల్లలు. అపూర్వ మైత్రికి చిహ్నం కాదా ఈ చిత్రం..

Animals-Build-4

 

5. కోతి, పిల్లి స్నేహం.. రెండు కలసి ఫోటోకు ఎలా ఫోజు ఇస్తున్నాయో చూడండి..

Animals-Build-8

 

6. చిన్నారి గజముతో కలసి మేమూ ఫోటోకు రెడీ అంటోంది ఈ వృషభం

Animals-Build-9

 

7. శుకనరాజుతో కలసి వున్నా.. నన్నెవ్వరూ ఏమీ చేయలేరు అన్నట్లు లేదు ఈ ఫోటోలో ఫోజు..

Animals-Build-10

 

8. సింహాలు గుహలో వుంటాయని చిన్నప్పుడు పాఠాల్లో చదవుకున్నాం. కానీ ఇప్పడు ఇక్కడ చూడండీ.. మేము వేరైనా.. అందరి నివాసం ఒక్కటే అన్నట్లుగా సింహము, భళ్లూకము, వ్యాఘ్రమం ఒక్కచోట వున్నాయి కాదూ

Animals-Build-5

 

9. నిద్రించు మిత్రామా.. నీకు కాపాలాగా నేనున్నాను అంటూ ఖడ్గమృగం పైకి ఎక్కిన మేషం భరోసా ఇస్తునట్టు వుంది కదా స్టిళ్లు

Animals-Build-6

 

10. గాండ్రు కప్పతో స్నేహం మరీ.. ముద్దు పెట్టుకుంటే తప్పాంటారా..?

Animals-Build-7

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles