Burdwan blast bangladesh arrests 3 myanmar nationals 500 kg explosives seized

India, Burdwan blast, Burdwan, West Bengal, Bangladesh, Myanmar, Rohingya Solidarity Organisation, Millitants, jamaatul mujahideen bangladesh, Dhaka's Lalbagh, 3 Myanmar nationals, Arrest

Three Myanmar nationals have been arrested in connection with the Burdwan blast, as India and Bangladesh stepped up the hunt for the conspirators along their borders to nab over 100 militants of the outlawed JMB.

తొవ్వేకొద్ది బయట పడుతున్న ఉగ్రవాదులు..

Posted: 12/02/2014 11:22 AM IST
Burdwan blast bangladesh arrests 3 myanmar nationals 500 kg explosives seized

పశ్చిమ బెంగాల్ లోని బర్ద్వాన్ లో జరిగిన పేలుళ్ల కేసులో మరో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుర్డ్వాన్ కేసును సంయుక్తంగా తొవ్వుతున్న బంగ్లాదేశ్, భారత్ పోలీసులు మయన్మార్ కు చెందిన ముగ్గురు ఉద్రవాదులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బంగ్లాదేశ్ లో తిష్టవేసి.. భారత్ లో పేలుళ్లకు కారణమవుతున్న వారిపై బంగ్లాదేశ్ పోలీసులతో కలసి భారత్ పోలీసులు పనిపడుతున్నారు. ఈ నేపథ్యంలో రోహిన్గ్య సాలిటరీ ఉగ్రవాద సంస్థకు చెదిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దును కేంద్రంగా చేసుకుని కుట్రలకు పాల్పడుతున్న జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ కు చెందిన మరో 100 మంది ఉగ్రవాదులను పోలీసుల జాయింట్ అపరేషన్ లో అదుపులోకి తీసుకున్నారు. మయన్మార్ కు  చెందిన రోహిన్గ్య సంఘీభావ ఉగ్రవాద సంస్థకు  చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని వాచరిస్తున్నట్లు ఢాఖా మెట్రోపాలిటన్ పోలీస్ ఢిఫ్యూటీ కమీషనర్ క్రిష్ణ పాదారాయ్ తెలిపారు. వారి వద్ద నుంచి 500 కేజీల పేలుడు సామాగ్రితో పాటు రెండు జిలిటిన్ అనుసంధాన బాంబులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే ఉగ్రవాదులు భారత్ కు వెళ్లారా..? లేదా అన్న అంశంమై తన వద్ద సమాచారం లేదన్నారు. వీరికి బర్డ్వాన్ బాంబు పేలుళ్లకు దగ్గర సంబంధాలు వున్నాయిని తాము అనుమానిస్తున్నాట్లు చెప్పారు. మయన్మార్ నుంచి అక్రమంగా బంగ్లాదేశ్ లోని చోరబడిని వీరిపై ముందుగా కేసు నమోదు చేశామని తెలిపారు. అంతేకాకుండా శీరు రోహిన్గ్య ఉగ్రవాద సంస్థ సభ్యులని ఆయన నిర్ధారించారు. నిందితులు ముగ్గురూ మదర్సాలలో విద్యను అభ్యసిస్తున్నట్లు పైకి నటించినా.. వారు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తమ దర్యాప్తులో తేలిందన్నారు.


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles