Shiv sena inching closer to joining bjp govt in maharashtra

Shiv Sena, BJP, state government, Maharashtra, prospects, Shiv Sena joining in BJP government, Chief Minister, Devendra Fadnavis, power sharing, positive conclusion, deliberations.

The prospects of Shiv Sena joining the first-ever BJP government in Maharashtra brightened on Monday with Chief Minister Devendra Fadnavis saying that the talks on power sharing being almost complete and Sena also hinting at the "positive conclusion" of deliberations.

అవును... వారిద్దరూ చేతులు కలుపుతున్నారు..

Posted: 12/02/2014 10:42 AM IST
Shiv sena inching closer to joining bjp govt in maharashtra

మహారాష్ట్రలో వారిద్దరూ ఒక్కటయ్యేందుకు చేతులు కలపుతున్నారు. వారే అధికార భారతీయ జనతా పార్టీ, ప్రధాన ప్రతిపక్ష శివసేన పార్టీ. మహారాష్ట్రలో తొలిసారి అధికారాన్ని చేపట్టిన బీజేపి ప్రభుత్వంలో చేరేందుకు గత రెండు నెలలుగా ఆశగా ఎదురుచూసిన శివసేన పార్టీ.. ఎట్టకేలకు అధికారంలో చేరేందుకు సమయం ఆసన్నమైంది.  ఈ మేరకు రెండు పార్టీల మధ్య జరిగిన తొలివిడత చర్చలు సఫలమయ్యాయి. అధికార పార్టీకి మద్దతు నిచ్చేందుకు శివసేన డిమాండ్ చేసిన మంత్రి పదవులను ఇచ్చేందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫెడ్నవిస్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

అయితే శివసేన కూడా తమ మధ్య చర్చలు సానుకూలంగా, విజయవంతంగా చర్చలు జరిగాయని తేల్చిచెప్పింది. గత పాతికేళ్లుగా ఈ రెండు పార్టీల మధ్య వున్న మైత్రి ఈ ధఫా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బెడిసికొట్టింది. అసెంబ్లీ స్థానాల కేటాయింపుల నుంచి అధికారం పంచుకునే విషయం వరకు ఈ రెండు పార్టీల మధ్య పొసగనే లేదు. హిందుత్వం అజెండాపై ఆవిర్భవించిన శివసేన, బీజేపీలు అధికారం చేపట్టడంలో ఐక్యంగా వుండాలని ఇప్పటికే ఆర్ఎస్ఎస్ నేతలు పలుమార్లు బీజేపి నేతలకు విన్నవించినా.. బీజేపి కొంత మేర వారి మాటలను కూడా పెడచెవిన పెట్టింది. ఎన్సీపి మద్దతుతో స్పీకర్ ఎన్నికను, అటు బలనిరూపణను ప్రధర్శంచింది.

అయితే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మహారాష్ట్రలోని తమ కార్యకర్తల సమావేశంలో చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో అధికార బీజేపి అలర్ట్ అయ్యింది. మహారాష్ట్రలో కొలవుదీరిన ప్రభుత్వంతో ఎంతోకాలం మనజాలదని.. పార్టీ కార్యకర్తలు ఎన్నికలకు సిద్దంగా వుండాలని వ్యాఖ్యాలు చేశారు. అప్పటి నుంచి తటపటాయించిన దేవేంద్ర ఫెడ్నవిస్ నేతృత్వంలోని ప్రభుత్వం.. తన పాత మిత్రుడితో జత కట్టాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు చకచకా పావులు కదిపింది. అంతే అధికారం మా కోద్దు అన్న శివసేన.. ప్రభుత్వంలో చేరుందుకు సుముఖత వ్యక్తం చేయడంతో.. ఇరు పార్టీల మధ్య మంత్రిపదవులకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి.

అయితే ఈ చర్చలు మరో ఒకటి రెండు రోజుల్లో కొలక్కి రానున్నట్లు బీజేపి, శివసేన వర్గాలు తెలిపాయి. ఇవాళ రాత్రి మరోమారు ఇరు పార్టీలు చర్చలు నిర్వహిస్తున్నాయి. శివసేన డిమాండ్ చేస్తున్న అన్ని మంత్రి పదవులు ఇచ్చేందుకు సుముఖంగా వున్న బీజేపి కేవలం ఒక్క ఉపముఖ్యమంత్రి పదవి విషయంలో కొంత నిరాసక్తత కనబరుస్తున్నట్లు సమాచారం. అయితే పార్టీ వర్గాలు మాత్రం సుమారుగా ఒక్క విషయం మినహా అన్ని అంశాల్లో ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. పాత మిత్రలు ఒక్కటై.. పాతికేళ్ల మైత్రి బంధం మళ్లీ చిగురించాలని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డుతున్నారు. శివసేన అధికార పక్షంలోకి చేరిన పక్షంలో కాంగ్రెస్ పార్టీకి ఫ్రధాన ప్రతిపక్ష హోదా దక్కనుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles