Diesel petrol prices cut by rs 1 00 litre during ongoing of jk jarkhand assembly elections

petrol, Diesel, Fuel, Omc, petrol prices, diesel prices, petroleum ministry, NDA government, deregulation, Fuel price, fuel price cut, Petrol price per litre, IOC

Diesel & petrol prices cut by Rs 1.00/litre during ongoing of Jk, jarkhand assembly elections

లీటరుపై రూపాయి మేర తగ్గిన ఇంధన ధరలు

Posted: 11/30/2014 09:15 PM IST
Diesel petrol prices cut by rs 1 00 litre during ongoing of jk jarkhand assembly elections

యూపీఏ రెండో పర్యాయం అధికారంలో వచ్చినప్పటి నుంచి పెరగడమే తప్ప తరగడం తెలియక పైపైకి ఎగబాకిన చమురు ధరలు గత నాలుగు నెలలుగా మెల్లిగా కిందకు దిగివస్తున్నాయి. దీంతో మరోమారు పెట్రోల్ ధర తగ్గింది. ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ విపణిలో బ్యారెల్‌ 115 డాలర్లు పలికిన బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర.. ప్రస్తుతం 78 డాలర్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో చమురు ధరలను లీటరుకు రూపాయి మేర..  ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తగ్గించాయి. ఈమేరకు అవి కేంద్ర పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన  సమావేశం నిర్ణయం తీసుకుంది. నాలుగు నెలల వ్యవధిలో (ఆగస్టు నుంచి) ఏనమిదవ సార్లు పెట్రోలు ధరలు తగ్గింది.

అలాగే.. డీజిల్‌ ధరలపై నియంత్రణ ఎత్తివేసి మార్కెట్‌ రేటుకు విక్రయించాలని గత ప్రభుత్వ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న తర్వాత డీజిల్‌ ధరలు తగ్గడం ఇదే నాల్గవ సారి. సరిగ్గా చెప్పాలంటే.. 2009 జనవరి 29న చివరిసారిగా డీజిల్‌ ధర రూ.2 మేర తగ్గింది. అప్పట్లో డీజిల్‌ ధర రూ.30.86. అప్పట్నుంచీ ధరలు పెరుగుతూ వచ్చాయే తప్ప తగ్గలేదు. అంతర్జాతీయంగా చమురు రేట్లలో తగ్గుదల కారణంగా పెట్రోల్ పై లీటర్ కు 91 పైసలు, డీజిల్ పై 84 పైసలు తగ్గింది. ఈ తగ్గిన ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నవంబర్ మొదట్లో పెట్రోల్ పై లీటర్ కు రూ.2.41 పైసలు తగ్గగా, డీజిల్ పై లీటర్ కు రూ.2.21 తగ్గిన సంగతి తెలిసిందే. ఈ తాజా సవరణతో పెట్రోల్ పై మొత్తంగా ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ రూ. 10.27 పైసలు తగ్గినట్లయ్యింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles