Donkey milk sells at rs 5000 per litre

Donkey Milk, buying, kovvuru, costly, west godavari

donkey milk sells at rs 5000 per litre

గాడిదలు వున్నా హ్యాపీగా బతికేయవచ్చు..

Posted: 11/29/2014 02:49 PM IST
Donkey milk sells at rs 5000 per litre

ఓరేయ్ గాడిద.. అంటూ ఎవరినైనా తిట్టేరు... పాపం గాడిద ఫీలవుతుంద'ని కాబోలు అనుకోకండి. గాడిద చాకిరి అన్న పదం గుర్తుందిగా, గాడిదలా ఎంత పని చేసినా.. ఫలితం వుండదని చెప్పడం లేదండి.. గాడిదలేం తుక్కవ కాదని మా ఉద్దేశం. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు.. కడవడైననేమి ఖరము పాలు' అన్న యోగి వేమన.. ఇకూడా ఇప్పడు వుండి వుంటే.. దానిని తిరగరాస్తారేమో. ఎందకంటే ఆవు పాల ధర లీటరుకు మహా అంటే యాభై రూపాయలు ఖరీదు చేస్తే.. ఖరము పాలు అదేనండి గాడిద పాలు ఏకంగా అందుకు వంద రెట్లు పలుకుతున్నాయి. దీంతో ఇప్పుడు గాడిద పాలు గుక్కెడైన చాలు అనే పరిస్థితి ఏర్పడింది.

గాడిద పాలు తాగితే చిన్న పిల్లలో, అందులోనూ పసిపిల్లలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ నమ్మకం ప్రజల్లో బలంగా ఉండటంతో వాటికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. అరుదుగా లభ్యమయ్యే ఈ పాటను అమ్మేవారు కనిపిస్తే అమాంతం వెళ్లి కొంటున్న వారు ఎక్కువమందే ఉన్నారు. గాడిద పాలు తాగితే ఆస్తమా, ఉబ్బసం, నెమ్ము, ఆయాసం, దగ్గు వంటి రోగాలు రావన్న నమ్మకంతో వీటిని కొనేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. గాడిద పాలతో ఉపయోగముందో తెలియదు గాని జనం మాత్రం ఎగబడి పాలను కొంటున్నారు. ఉగ్గు గిన్నుడు (10 మిల్లీ లీటర్లు) గాడిద పాలు రూ.30 నుంచి రూ.50 ధర పలకడం చూస్తే ఆ మాటలు తారుమారు అయ్యాయని అనుకోక తప్పదు. ఈ లెక్కన లీటరు గాడిద పాలు రూ.3 వేలు నుంచి రూ.5 వేలకు విక్రయిస్తున్నారు.

ఒకప్పుడు ఏ పనీ చేయకుండా తిరిగేవారిని..ఏం పనీ చేయకపోతే...గాడిదలను కాస్తావా? అని వెటకారంగా అనేవారు. ఇప్పుడు గాడిదను కాసేవారు గాడిద పాలను అమ్మి డబ్బు సంపాదిస్తున్నారు. సంచార కుటుంబానికి చెందిన వ్యక్తి తాను పెంచుతున్న గాడిదతో ఊరూరా తిరుగుతూ దాని పాలు పిండి విక్రయిస్తున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో గాడిద పాలను విక్రయించాడు. ఉగ్గు గిన్నెడు పాలను రూ.400 నుంచి రూ.50కి విక్రయిస్తున్నానని, రోజుకు ఇలా రూ.400 నుంచి రూ.400 సంపాదిస్తున్నట్లు చెప్పడం విశేషం.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donkey Milk  buying  kovvuru  costly  west godavari  

Other Articles