First test postponed as phillip hughes funeral arrangements confirmed

cricket, sport, International, Austrlia vs India, First Test, postpone, Phillip Hughes, funeral arrangement, australia cricker board, CEO sutherland, BCCI

First Test postponed as Phillip Hughes' funeral arrangements confirmed

హ్యూస్ అంత్యక్రియల నేపథ్యంలో తొలి టెస్టు వాయిదా

Posted: 11/29/2014 02:41 PM IST
First test postponed as phillip hughes funeral arrangements confirmed

పాతికేళ్ల వయస్సులోనే తన అద్భుతమైన ఆటతో అస్ట్రేలియా క్రికెట్ లో సంచలనాలను నమోదు చేసిన ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు డిసెంబర్ 3న నిర్వహించేందుకు అతని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. డిసెంబర్ మూడున అస్ట్రేలియా కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హ్యూస్ జన్మస్థలం న్యూ సౌత్ వేల్స్ లోని మాక్ విల్లీలో అంతిమ సంస్కారాలు జరుగనున్నాయి. హ్యూస్ అంతిమ యాత్రకు వచ్చే అభిమానుల కోసం సిడ్నీ నుంచి కాఫ్స్ హర్భర్ వరకు రెండు అదనపు బి 737 విమాన సర్వీసులను వేయనున్నట్లు కాంటాస్ విమానం ప్రకటించింది. దేశవాలి క్రికెట్ అడుతూ సియన్ అబాంట్ విసిరిన షాట్ బాల్ ను పుల్ చేయబొయి విఫలమై కావడంతో.. తలపై బలమైన గాయం ఏర్పడి హ్యూస్ మరణానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 4న భారత్ అస్ట్రేలియా మధ్య జరగాల్సిన తొలి టెస్టు వాయిదా పడింది. తొలి టెస్టు టిక్కెట్లను కూడా అధికారులు సస్సెండ్ చేశారు. టిక్కెట్లను ఖరీదు చేసిన వారు.. తమ తరువాతి ప్రకటన వెలువడే వరకు వాటిని అలాగే భద్రపర్చుకోవాలని అధికారులు తెలిపారు.

క్రికెట్ ఆడుతూ తమ జట్టు సభ్యుడిని కోల్పయిన అస్ట్రేలియా క్రికెట్ జట్టు దు:ఖ సాగరంలో మునిగిందని, ఇలాంటి సమయంలో వారు క్రికెట్ ఎలా ఆడగలరని అస్ట్రేలియా క్రికెట్ జట్టు సీఈఓ జేమ్స్ సుథర్ ల్యాండ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలు అతి అరుదుగా సంభవిస్తాయని, అతని తుది వీడ్కోలు పలికిన మరుసటి రోజునే క్రికెట్ అడేగుందుకు కూడా జట్టు సభ్యులు సిద్దంగా వుండరని అన్నారు. జట్టు సభ్యులు సంక్షేమమే తమకు ముఖ్యమన్నారు. అస్ట్రేలియా జట్టు సభ్యులు తీవ్రమైన మనసిక ఒత్తిడిలో వున్నారని తెలిపారు. తమ జట్టు సభ్యుల పరిస్థితిని అర్థం చేసుకుని మద్దతు పలికిన బీసీసీఐకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హ్యూస్ మరణవార్తతో సంతాపం తెలిపి ఆయన కుటుంబానికి అండగా నిలిచిన అస్ట్రేలియా సహా ప్రపంచ వ్యాప్త  అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఫిలిప్ హ్యూస్ గౌరవార్థం అతని అంతర్జాతీయ వన్డే జెర్సీని రిటైర్ చేశారు. హ్యూస్ జెర్సీ నెంబర్ 64ను ఇక మీదట ఎవరికీ కేటాయించరు. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ జట్టు కెప్టెన్ మైకేల్ క్లార్ చెప్పాడు. హ్యూస్ జెర్సీని రిటర్ చేయాలని ప్రతిపాదించగా, క్రికెట్ బోర్డు అందుకు అంగీకరించిందని క్లార్ వెల్లడించాడు. హ్యూస్ లేని లోటు తీర్చలేనిదని,  డ్రెస్సింగ్ రూమ్ మునుపటిలా ఉండదని క్లార్క్ ఆవేదన వ్యక్తం చేశాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles