Government hospitals to be upgraded to corperate level and even medical collages

Government hospitals, upgrade, corperate level, medical collages, union health minister nadda, Prime minister, Narendra modi, PM health security scheme

Government hospitals to be upgraded to corperate level, and even medical collages says union health minister nadda

త్వరలో ప్రభుత్వ ఆసుపత్రులకు మంచి రోజులు..

Posted: 11/29/2014 10:20 AM IST
Government hospitals to be upgraded to corperate level and even medical collages

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు అసుపత్రులకు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. ప్రధానమంత్రి ఆరోగ్య సంరక్షణ పథకం కింద వివిధ రాష్ట్రాల్లో దశల వారీగా అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) తరహా సంస్థలను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి జేపీ నద్దా పేర్కొన్నారు. ఎయిమ్స్ తరహా సంస్థ ఏర్పాటుకు కావాల్సిన ప్రదేశాన్ని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. ఈ పథకం కింద ప్రస్తుతమున్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, సంస్థలను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల స్థాయికి పెంచుతామని చెప్పారు. వీటిలో తిరుపతిలోని స్విమ్స్, హైదరాబాద్‌లోని నిమ్స్ స్థాయిని రెండో దశలో పెంచుతామని తెలిపారు. మూడో దశలో విజయవాడలోని సిద్దార్థ వైద్యకళాశాల, అనంతపురంలోని ప్రభుత్వ వైద్యకళాశాల, ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ వైద్యవిజ్ఞాన సంస్థ, వరంగల్‌లోని కాకతీయ వైద్యకళాశాల స్థాయిని పెంచుతామని వివరించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు రెండు, తెలంగాణకు ఒకటి చొప్పున జాతీయ పెట్టుబడి, తయారీ మండళ్లను సూత్రప్రాయంగా కేటాయించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏపీలో చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో, తెలంగాణలో మెదక్ జిల్లాలో ఇవి ఏర్పాటవుతాయన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 17 మండళ్లకు సూత్రప్రాయ ఆమోదం తెలిపామన్నారు. చెన్నై-బెంగళూరు మధ్య; విశాఖపట్నం-చెన్నై మధ్య పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏపీలో 18 ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్‌ల)లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, మరో 27 సెజ్‌లలో జరగడం లేదని తెలిపారు. తెలంగాణలో 24 సెజ్‌లలో కార్యకలాపాలు ఉన్నాయని, 36 సెజ్‌లలో లేవని చెప్పారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles