Andhra pradesh government aims to make state industrailized

Andhra pradesh, AP government, industrailized, CM chandrababu, japan tour, assurence, japan capitalists, japan Prime minister, shinzo abe, world class capital

Andhra pradesh government aims to make state industrailized, CM chandrababu gets assurence from japan Prime minister

పారిశ్రామికాంధ్రను దిశగా నవ్యాంధ్రప్రదేశ్ పయనం..

Posted: 11/29/2014 11:23 AM IST
Andhra pradesh government aims to make state industrailized

రాష్ట్ర విభజనతో రాజధాని లేని రాష్ట్రంగా మారిన నవ్యాంధ్రప్రదేశ్ ను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలబెట్టాలని రాష్ట్ర ప్రభత్వం యోచిస్తోంది. ఇందుకు అనూగూణంగా పలు దేశాలలో పర్యటనలు చేస్తున్న ముఖ్యమంత్ర చంద్రబాబు బృందం పలు దేశాధినేతలతో హామీలను కూడా పోందగలుగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడుల్ని ఆకర్షించటమే ప్రధాన లక్ష్యంగా సాగిన చంద్రబాబు బృందం జపాన్ పర్యటన ఆశించిన మేరకు సఫలం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచస్థాయిలో రాజధాని నిర్మాణానికి, పెట్టుబడులు పెట్టి పారిశ్రమిక ప్రగతికి సహకరిస్తామని జపాన్ ప్రధాని షింజో అబే చంద్రబాబు బృందానికి హామిని ఇచ్చారు. దీంతో తన బృందంతో జపాన్ పర్యటనను ముగించుకున్న చంద్రబాబు ఇవాళ అర్థరాత్రి హైదరాబాద్ కు తిరిగి రానున్నారు.

రాష్ట్రాభివృద్ది కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబును జపాన్‌లోని తెలుగువాళ్లు సన్మానించారు. ఈ సందర్బంగా చంద్రబాబు వారినుద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించాలని అటు సాప్ట్ వేర్ పరిశ్రమలతో పాటు ఇటు ఉత్పాదక రంగ పరిశ్రమలను కూడా ఏర్పాటు చేసే క్రమంలో తనకు జపాన్ పర్యటన దోహదపడిందన్నారు. రాష్ట్రంలో రాజధాని నగరాన్ని ప్రపంచ దేశాల రాజధానులకు ధీటుగా నిర్మాణం చేస్తామన్నారు. ఇందుకు జపాన్ , సింగపూర్ దేశాల సహాకారం పొందుతామని చెప్పారు. జపాన్ పర్యటన రాష్ట్రాభివృద్దికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతకుముందు జపాన్ ప్రధానమంత్రి షింజో అబే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని చంద్రబాబుకు షింజో అబె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అబేకు తిరుమల శ్రీవారి ప్రసాదం అందించారు. శాలువాకప్పి జ్ఞాపికను బహూకరించి గౌరవించారు. తన పర్యటనలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటురంగ ప్రతినిధులతో సమావేశమైన విషయాన్ని జపాన్ ప్రధానికి వివరించి ఏపీ అభివృద్ధికి చేయూత అందించాలని కోరారు. ఏపీలో వున్న సహజ వనరులు, మానవ వనరుల బలం గురించి జపాన్ ప్రధానికి ఈ సందర్బంగా చంద్రబాబు వివరించారు. తమ రాష్ట్రంలో ఉన్న వనరులకు జపాన్ పెట్టుబడులు తోడయితే అద్భుత ఫలితాలు వస్తాయని ఆయనకు వివరించారు. జనవరిలో భారతదేశ పర్యటనకు వస్తున్న జపాన్ ప్రధానిని ఆంధ్రప్రదేశ్‌కూ రావాలంటూ ఆహ్వానించారు.

జపాన్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పారిశ్రామిక దిగ్గజం హిటాచి గ్రూప్ జీఎం అకిరా షిముజుతో భేటీ అయ్యారు. ఏపీలో పోర్టుల అభివృద్ధికి తాము సహకరిస్తామని ఈ సందర్భంగా హిటాచ్ గ్రూప్ హామీ ఇచ్చింది. తాము పెట్టుబడులు పెడతామని, రాయితీలు కల్పించాలని కోరారు. సీఎం చంద్రబాబు స్పందిస్తూ... గత పదేళ్లలో భారత్‌పై జపాన్‌కు ఉన్న అభిప్రాయాన్ని తొలగించుకోవాలన్నారు. భారత్‌లో ఇప్పుడు రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని.. పరిశ్రమలకు వేగంగా అనుమతులు లభిస్తున్నాయన్నారు. ఏపీలో జపనీస్ డెస్క్ పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తానికి కోటి ఆశలతో శతకోటి పెట్టుబడులను ఆకర్షేందుకు వెళ్లిన చంద్రబాబు సక్సెస్ సాధించి.. భారత్ కు తిరుగు పయనమయ్యారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles