క్రికెట్ ప్రేమికులకు విషాదం మిగులుస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఫిలిప్ హ్యూస్ మరణంపై డాక్టర్లు వివరణ ఇచ్చారు. ఆయనకు చికిత్స అందించిన సెయింట్ విన్సెట్ హాస్పిటల్ వైద్యులు క్రికెటర్ మృతికి గల కారణాలను బయటకు వెల్లడించారు. మరణానికి కారణం అయిన గాయం చిన్నదే అని చెప్పారు. అయితే దాని ప్రభావం మాత్రం చాలా తీవ్రమైనదిగా వెల్లడించారు. అందువల్లే గాయం బయటకు కన్పించకపోయినా అది ఫిలిప్ మృతికి కారణం అయిందని విన్సెంట్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
ఈనెల 25న సిడ్నీ స్టేడియంలో దేశీయ క్రికెట్ టోర్నీలో షాట్ల ఎంపిక సమయంలో జరిగిన చిన్న తప్పిదం వల్ల ఫిలిప్ దవడకు బంతి బలంగా తగిలిన విషయం తెలిసిందే. ఈ గాయం ధాటికి ఫిలిప్ అక్కడికక్కడే కుప్పకూలిపోవటంతో పాటు కోమాలోకి వెళ్ళాడు. డాక్టర్లు రెండ్రోజల పాటు తీవ్రంగా శ్రమించినా చికిత్స ఫలించకుండా ప్రాణాలు కోల్పోయాడు. ఈ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కేవలం బంతి తాకిడికే ఫిలిప్ చనిపోయాడా.. లేక మరేదైనా కారణం ఉందా అని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఫిలిప్ బంతి తాకడం వల్లే చనిపోయాడంటూ ప్రకటించారు.
అయితే ఆయనకు తగిలిన గాయం చిన్నదే అని చెప్పారు. అరుదైన ఈ గాయం వల్ల ఫిలిప్ ప్రాణాలు పోయినట్లు వెల్లడించారు. దవడ కింద భాగంలో ఉండే వెర్టెబ్రల్ ఆర్టెరీకి బంతి బలంగా తగిలిందని డాక్టర్లు వెల్లడించారు. వెర్టెబ్రల్ ఆర్టెరీ సాధారణ స్థితికి రాకపోవటంతో శరీరంలో సమాచార, రక్త ప్రసరణ వ్యవస్థలో ఆటంకం ఏర్పడి చనిపోయాడని చెప్పారు. శరీరం నుంచి మెదడుకు కనెక్ట్ అయి ఉండే కీలక భాగంలో దెబ్బ తగలటంతో కోలుకోలేక తిరిగిరాని లోకాలకు వెళ్ళినట్లు వైద్యులు తెలిపారు. ఇలా జరగటం చాలా అరుదని వారు అంటున్నారు.
ఏమిటీ వెర్టెబ్రల్ ఆర్టెరీ...?
ఏమిటీ వెర్టెబ్రల్ ఆర్టెరీ...?
మనిషి శరీరంలో మెదడు చాలా కీలకమైన భాగం అని తెలుసిందే. మనిషిని నియంత్రించి, ఆలోచింపజేసే మేధస్సు మెదడు సొంతం. మనం పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ తో పాటు తినే తిండిలో శక్తిని మెదడు చాలావరకు వినియోగించుకుంటుంది. శరీరంపై పూర్తి నియంత్రణ ఉండే మెదడుకు శరీరంలోని వివిధ భాగాల నుంచి రక్త ప్రసరణ జరుగుతుంది. శరీరంలోని భాగాలన్నిటి నుంచి వెర్టెబ్రల్ ఆర్టెరికి రక్తం వచ్చి అక్కడి నుంచి మెదడుకు వెళ్తుంది. అంటే మెదడుకు రక్తం చేరవేయటంలో ఇది ఎంత కీలక భూమిక పోషిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
చనిపోయిన క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ విషయంలో బంతి బలంగా తగలటంతో ఈ వెర్టెబ్రల్ ఆర్టెరీ నలిగిపోయినట్లు డాక్టర్లు చెప్తున్నారు. దీంతో మెదడుకు శరీర భాగాల నుంచి రక్త ప్రసరణ నిలిచిపోయింది. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఇలా మెదడుకు రక్త ప్రసరణ నిలిచిపోవటం అనేది చాలా అరుదైన ఘటన. రక్త ప్రసరణ నిలిచిపోతే మెదడు పనిచేయటం తగ్గిస్తుంది. ఫలితంగా శరీర భాగాలు అచేతనావస్థలోకి వెళ్తాయి. తాజా కేసులో అలా జరగకుండా మెదడు ఒత్తిడిని తగ్గించేందుకు ఫిలిప్ ను వైద్యులు కోమాలోకి పంపారని తెలుస్తోంది. అంతేకాకుండా మెదడుకు రక్త ప్రసరణ పెంచేందుకు పుర్రెలో కొంత భాగం కూడా తొలగించారు. కోలుకునేందుకు చికిత్స చేస్తుండగానే.., ఫిలిప్ చనిపోయాడు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more