Marriage may forge new mulayam lalu alliance

Mulayam Singh Yadav, Lalu Prasad, Tej Pratap, Raj Lakshmi, Marriage, samajwadi party, SP, RJD, rastreya janatadal

marriage may forge new mulayam singh yadav lalu prasads alliance

ఆ ఇద్దరు నేతలు తండ్రీ కోడుకులు కాబోతున్నారు..

Posted: 11/28/2014 10:59 AM IST
Marriage may forge new mulayam lalu alliance

రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మళ్లీ తండ్రి కాబోతున్నారు. అది కూడా ఓ మహా నేతకు, ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలో వున్న సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ కు లాలూ ప్రసాద్ యాదవ్ తండ్రి కాబోతున్నారు. అదేంటినుకుంటున్నారా.. లాలూ ప్రసాద్ కుమార్తె తనయుడు, మెయిన్ పురి పార్లమెంటరీ సభ్యుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహంతో వీరిద్దరి వరుసలు మారుతున్నాయి. ఎందుకంటే తేజ్ ప్రతాప్ యాదవ్ కు తన చిన్నకుమార్తె రాజ్ లక్ష్మీకి వివాహం కుదిరింది. ఈ మేరకు రెండు కుటుంబాల పెద్దలు అంగీకారానికి వచ్చారు.

లాలూ రాజకీయ వారసుడిగా ఆయన మనవడు తేజ్ ప్రతాప్ యాదవ్ తొలిసారిగా రాజకీయ అరంగ్రేటం చేశాడు. లలూ ప్రసాద్ యాదవ్ ను ఎన్నికల్లో పోటీచేసేందుకు అనర్హుడిగా కోర్టు ప్రకటించిన నేపథ్యంలో ఆయన తన మనుమడిని వారసుడిగా ప్రకటించారు. తొలి సారితోనే ఆయన పార్లమెంటులో అడుగుపెట్టారు. ములాయంకు గట్టి పట్టున్న మెయిన్ పురి పార్లమెంటు నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ చేసిన ఆయన ప్రతికూల వాతావరణంలోనూ ఎంపీగా ఎన్నికైయ్యారు. దీంతో మనవడికి పెళ్లి చేయాలని యోచించిన లాలూ.. ములాయం సింగ్ చిన్న కూమార్తె రాజ్ లక్ష్మీతో పెళ్లి కుదిర్చాడు. డిసెంబర్ నెల మధ్యలో వీరి నిశ్చితార్థం ఫిక్స్ చేయగా, ఫిబ్రవరిలో ఇరు యాదవ నేతల ద్వయం ఇళ్లలోనూ పెళ్లి బాజాలు మ్రెగనున్నాయి. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ లు తండ్రి కోడుకుల వరసలో బందువులు కాబోతున్నారు.

కాగా, ఈ పెళ్లితో ఉత్తరాది రాజకీయాలు కొత్త రూపు సంతరించుకోబోతున్నాయి. ఇప్పటికే బీహార్లో అధికార జనతాదళ్ (యూ), మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీ రాబోయే ఎన్నికల్లో కలసి పనిచేయాలని నిర్ణయించగా, ఈ కూటమికి ఉత్తరప్రదేశ్లోని అధికార సమాజ్వాదీ పార్టీ దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు మంచి సన్నిహితులుగా వుండి మండల్ కమీషన్ వ్యవస్థను కోనసాగించాలని చేసిన ఉద్యమాల్లో ఇరువురు నేతలు చురుగ్గా పాల్గొని కలసి పనిచేశారు. అ తరువాత ప్రధాని పదవి విషయంలో 1997లో వారిద్దరి మధ్య విభేధాలు పోడచూపడంతో దశాబ్దమున్నార  కాలం పాటు వారు దూరంగానే వున్నారు. కాగా ఇప్పడు మళ్లీ వారు తమ స్నేహాన్ని.. బంధుత్వంగా మార్చుకోవడంతో రాజకీయ వర్గాలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఈ యాదవ ద్వయం బంధువులు కాబోతున్నారన్న వార్తతో సమాజ్ వాదీలు కూడా సంబరపడుతున్నారు. తమ నేత ములాయం బహుచక్కని నిర్ణయం తీసుకున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mulayam Singh Yadav  Lalu Prasad  Tej Pratap  Raj Lakshmi  Marriage  samajwadi party  SP  RJD  rastreya janatadal  

Other Articles