N srinivasan must relinquish either bcci post or csk ownership orders supreme court

Cricket Australia, Phillip Hughes, serious injury, dead

Resuming the hearing of the IPL spot-fixing and betting scandal case, the Supreme Court questioned the BCCI as to why Chennai Super Kings shouldn't be disqualified from the IPL court observed that Srinivasan by virtue of being President-in-exile of BCCI and the CSK owner holds two posts leading to a conflict of interest. Asking the cricket's governing body to end all controversies, the SC recommended Srinivasan to relinquish one of the two posts.

చెన్నై టీమ్ రద్దు చేయాలి లేదా యాజమాన్యాన్ని మార్చాలి..

Posted: 11/27/2014 04:30 PM IST
N srinivasan must relinquish either bcci post or csk ownership orders supreme court

ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టును ఎందుకు  రద్దు చేయాలని సుప్రీంకోర్టు బీసీసీఐని ప్రశ్నించింది. తక్షణమే చెన్నై జట్టును రద్దు చేయాలని ఆదేశించింది. ముద్గల్ కమిటీ నివేదిక ఆధారంగా బీసీసీఐ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసుపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. కేసు విచారణ సందర్భంగా బీసీసీఐ మాజీ చీఫ్ శ్రీనివాసన్ను సుప్రీం ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. బీసీసీఐ అధ్యక్షుడిగా కోనసాగుతూ.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అధిపతిగా ఎలా కోనసాగుతారని శ్రీనివాసన్ ను సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. రెండు పదవులన అలకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. వాటిలో ఎదో ఒక దానిలో మాత్రమే కోనసాగాలని తేల్చిచెప్పింది.

జస్టిస్ టీ ఎస్ థాకూర్, జస్టిస్ ఫకీర్ మహ్మద్ ఇబ్రహీం ఖలీఫుల్లాలతో కూడిన అత్యున్నత న్యాయస్థానం ద్విసభ్య బెంచ్ బీసీసీఐ అధ్యక్షడు శ్రీనివాసన్ తరపున అతని న్యాయవాది సమర్పించిన పిటీషన్ను తోసిపుచ్చింది. శ్రీనివాసన్ మేనల్లుడు గురునాథ్ మయ్యప్పన్‌పై బెట్టింగ్ ఆరోపణలున్నాయని ఈ నేపథ్యంలో జట్టును రద్దు చేయాలని, లేదా యాజమాన్యాన్ని మార్చాలని ఆదేశిందింది. చెన్నై సూపర్ కింగ్స్ ఎవరి నియంత్రణలో ఉందో వివరాలు తెలపాలని కోరింది. దోషులుగా తేలినవారిపై చర్యలకు ఎక్స్టెర్నల్ కమిషన్ వేయాలని తెలిపింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు విషయంలో చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

బీసీసీఐ ఎన్నికలను షెడ్యూలు ప్రకారమే జరుపుకోవచ్చు గానీ, ముద్గల్ నివేదికలో పేర్లున్నవాళ్లు మాత్రం బీసీసీఐ ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇక  చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో వాటాదారుల వివరాలు ఇవ్వాలని తెలిపింది. ఇండియా సిమెంట్స్ యాజమాన్యంలోని సీఎస్కే ఎవరి నియంత్రణలో ఉందని ప్రశ్నించింది. ఇండియాసిమెంట్స్ వాటాదారులు, బోర్డు సభ్యుల వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది.  సీఎస్కే కెప్టెన్ ధోనీ ఇండియా సిమెంట్స్లో పనిచేయడంపై కూడా సుప్రీంకోర్టు ఆరా తీసింది. అన్ని రకాల వివాదాలకు తెరదించాలని బీసీసీఐని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles