Humiliating treatment may amount to sexual harassment central government brings new rules

Humiliating treatment, which is likely to affect women government employees health or safety may amount to sexual harassment, the government said

Humiliating treatment, which is likely to affect women government employees health or safety may amount to sexual harassment, the government said

వారితో చనువుగా వున్నా వేదింపులేనట.. జాగ్రత్తా..!

Posted: 11/27/2014 03:57 PM IST
Humiliating treatment may amount to sexual harassment central government brings new rules

ఆరోగ్యం, భద్రత ప్రభావితమయ్యేలా ఉద్యోగినులను ఇబ్బందులకు గురిచేయడం కూడా ఇప్పుడిక లైంగిక వేధింపుల కిందికే వస్తుందని కేంద్రం పేర్కొంది. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన మార్పులతో ఉద్యోగినులను ప్రభావితమయ్యేలా చేపట్టే చర్యలు కూడా లైంగిక వేధింపుల పరిధిలోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. మహిళా ఉద్యోగినిల పట్ల ప్రత్యేక అభిమానాన్ని చూపినా, హాని కలిగిస్తామని బెదిరించడం వంటి చర్యలకు పాల్పడినా అవీ వేధింపుల కిందికే వస్తాయని విస్తృత నిర్వచనం ఇచ్చింది

ప్రభుత్వ ఉద్యోగుల సేవా నిబంధనలను ఈ మేరకు సవరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాతపూర్వక సమాధానంలో ఈ విషయాలు వెల్లడించారు. లైంగిక వేధింపుల నిర్వచనాన్ని విస్తృతం చేసి, పని ప్రదేశాల్లో మహిళలకు సానుకూలమైన వాతావరణాన్ని తీసుకురావడానికి లైంగిక వేధింపుల నిబంధనలను మరింత కఠినత చేసి మర్చినట్లు తెలిపారు.

ప్రస్తుత లేదా భవిష్యత్తు ఉద్యోగానికి సంబంధించిన బెదిరింపులు కూడా వేధింపుల కిందే ఫరిగణించబడతాయన్నారు. ఉద్యోగినుల పనుల్లో జోక్యం చేసుకోవడం, పని వాతావరణంలో ఇబ్బందులు సృష్టించడం వంటివీ వేధింపుల కిందికి వస్తాయని చెప్పారు. మాటలు, చేతలు, చేష్టలు, సైగలు...ఇలా ఏ రూపంలో లైంగిక వేధింపులకు పాల్పడినా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేటు రంగంలో పనిచేసే మహిళల కోసం, ఇళ్లలో పనిచేసేవారు, వ్యవసాయ కూలీల కోసం కొత్త చట్టాన్ని రూపొందించామని, వీరందరూ కొత్తచట్టం పరిధిలోకి వస్తారని మంత్రి చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sexual harassment  Jitendra Singh  Humiliating treatment  women employees  health  safety  nation  

Other Articles