Law amended for appointment cbi director amendments made targeting us alleges congress

cbi director, cbi appointment, central government, parliament, lok sabha, Veerappa moily, opposition, congress

law amended for appointment cbi director, amendments made targeting us alleges congress

సీబీఐ డైరెక్టర్ నియామాకానికి వారిద్దరుంటే చాలు..

Posted: 11/26/2014 04:09 PM IST
Law amended for appointment cbi director amendments made targeting us alleges congress

సీబీఐ డైరెక్టర్ నియామకంలో సవరణల బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. తాజా బిల్లు ప్రకారం, సీబీఐ డైరెక్టర్ నియామకాన్ని ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభలో ప్రతిపక్షనేత కలిసి నిర్ణయిస్తారు. అయితే, ఇందులో ఏ ఒక్కరు గైర్హాజరైనా.. మిగిలిన ఇద్దరు కలిసి నియామకం చేయొచ్చని కేంద్రం తెలిపింది. ఈ నిబంధనపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పదవులు ఎప్పుడూ ఖాళీగా ఉండబోవని కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకునే ఈ నిబంధన పెట్టారని ఆయన విమర్శించారు. ఇప్పటీకీ ప్రతిపక్ష నేతను ప్రభుత్వం గుర్తించలేదని, కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఆయన అన్నారు.

కాగా మరో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ ఎంపీ వీరప్ప మొయిలీ మాట్లాడుతూ.. లోక్సభలో ప్రతిపక్ష హోదా కోసం తాము అడుక్కోవడం లేదని అన్నారు.  లోక్సభలో సీబీఐ డైరెక్టర్ నియాయకంలో సవరణలపై చర్చ సందర్బంగా ప్రతిపక్ష పార్టీ గుర్తింపుపై ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు.  ప్రజాస్వామ్యంలో విధానాలు పాటించాలని, ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని వీరప్ప మొయిలీ అన్నారు. దేశంలో మార్పుకు శ్రీకారం చుడతామని చెప్పిన మోడీ, పాత పద్దతలను , యూపీఏ అవలంభించిన పద్దతులనే అనుసరిస్తున్నారని మండిపడ్డారు.

కాగా  లోక్‌సభలో ప్రతిపక్ష హోదాపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధనను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు.. ప్రతిపక్ష హోదా కావాలంటే మొత్తం లోక్ సభ సీట్లలో పది శాతం సీట్లు ఉండాలి. అంటే లోక్ సభలో కనీసం 55 సీట్లు ఉండాలి. అయితే  లోక్ సభలో కాంగ్రెస్కు 44 సీట్లు మాత్రమే ఉన్నాయి.  దాంతో సభ నియమ నిబంధనల మేరకు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వటం కుదరదని స్పీకర్ తేల్చి చెప్పారు
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles